భూములను పంపిణీ చేయనుందని వైయస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ
విజయసాయిరెడ్డి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పలు అంశాలపై గురువారం
స్పందించారు. 23 జిల్లాల్లో 54 ఎకరాలను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు
ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ
మైనారిటీలో అర్హులైన సుమారు 47 వేల మంది లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక
చేసిందని చెప్పారు.
వైద్యశాఖలో 2,118 పోస్టు మంజూరు : రాష్ట్రంలో మరో మూడు వైద్య కళాశాలలు కొత్తగా
ప్రారంభింభం కానున్నాయని విజయసాయిరెడ్డి చెప్పారు. అందులో భాగంగా ప్రభుత్వం
2,118 పోస్టులను మంజూరు చేసిందని, ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు కూడా
జారీ చేసిన అని తెలిపారు.
పిల్లలు ఎత్తు తగ్గుతున్నారు : బ్రిటన్లో జరిపిన ఒక అధ్యయనం నుండి షాకింగ్
ఫలితాలు వెలువడ్డాయని, దీని నుండి ప్రతి ఒక్కరూ చాలా విషయాలు
తెలుసుకోవాలన్నారు. బ్రిటన్లో ఐదేళ్లలోపు పిల్లల సగటు ఎత్తు తగ్గినట్లు
బ్రిటన్లోని థింక్ ట్యాంక్ ‘ఫుడ్ ఫౌండేషన్’ అధ్యయనంలో తేలిందన్నారు. 1985
నాటి 200 దేశాల హైట్ ర్యాంకింగ్లో, ఈ వయస్సులో ఉన్న బ్రిటిష్ పిల్లలు 69వ
స్థానంలో ఉన్నారని చెప్పారు. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పు వల్ల పిల్లల
సగటు ఎత్తు తగ్గిపోయి దుష్ప్రభావాలకు జంక్ ఫుడ్ ప్రధాన కారణమని ఈ దేశ నిపుణులు
చెబుతున్నారని ఆందోళన వ్యక్తం వేశారు.