శ్రీనివాస రావు
నిబంధనలు లోబడి పట్టాల రెగ్యూలరైజేషన్ కి కృషి చేస్తాం : జేసీ సంపత్ కుమార్
విజయవాడ పశ్చిమ : స్థానిక భవానీపురం 38,40,41వ డివిజన్ల పరిధిలో ఉన్న కృష్ణ
నది కరకట్ట ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లపట్టాలను రెగ్యూలరైజ్ చేసేందుకు గురువారం
మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు జాయింట్
కలెక్టర్ సంపత్ కుమార్ తో కలిసి క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేశారు ఈ
సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ కరకట్ట ప్రాంతంలో మూడు డివిజన్ల పరిధిలో
దాదాపు 11 వందల ఇల్లు ఉన్నాయని వారందరు పట్టాలు కలిగి ఉన్నారని ఆ పట్టాలు
రెగ్యూలరైజేషన్ కోసం ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉందని వారికీ ఒక
కల లా నిలిచిపోయిందని ఆ కలను సాకారం చేసేందుకే ఈ రోజు ఫీల్డ్ విజిట్ చేయడం
జరిగిందన్నారు. ఎన్నో దశాబ్దాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ
ఇచ్చారు.ప్రభుత్వం అందరికి తోడుగా ఉంటుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి
చేస్తున్న అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.జాయింట్ కలెక్టర్ సంపత్ గారు
మాట్లాడుతూ నిబంధనలకు లోబడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానిక
శాసనసభ్యులు వెలంపల్లి చొరవతో ఫీల్డ్ విజిట్ చేశామన్నారు. నిబంధనల మేరకు
సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో
స్థానిక కార్పొరేటర్లు షేక్ రెహమాతున్నీసా,యరడ్ల ఆంజనేయ రెడ్డి,ఎండీ ఇర్ఫాన్,
డివిజన్ నాయకులు,కార్యకర్తలు, ఇరిగేషన్ అధికారులు,రెవెన్యూ అధికారులు నగరపాలక
సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.