న్యూఢిల్లీ : లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తాజాగా ఇచ్చిన ఆదేశాలపై
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా అసహనం
వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, అరవింద్ కేజ్రీవాల్
నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది.
తాజాగా వీకే సక్సేనా ఇచ్చిన ఉత్తర్వులను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు.
వాటితో దిల్లీ ప్రభుత్వం గొంతును నులిమేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్జీ బుధవారం మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. దానికింద దిల్లీ
ప్రభుత్వంలోని నిపుణులు, సలహాదారులు ఎల్జీ అనుమతి లేకుండా కార్యకలాపాలు
నిర్వహించకూదని వాటి సారాంశం. నేరుగా సక్సేనాకు నివేదించే సేవల విభాగం ఈ మేరకు
అన్ని శాఖలకు లేఖలు పంపింది. దీనిపై కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా స్పందించారు.
‘ఈ ఉత్తర్వులు ఢిల్లీ ప్రభుత్వం గొంతును పూర్తిగా నులిమేస్తాయి. ఇది ప్రభుత్వ
పనితీరును పూర్తిగా అణచివేస్తుంది. ఈ నిర్ణయాలతో గౌరవనీయ ఎల్జీ ఏం
సాధించాలనుకుంటున్నారు. సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వులను కొట్టివేస్తుందని
ఆశిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఇదివరకు కూడా ఎల్జీ ఈ తరహా
ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆప్ సర్కారు వివిధ విభాగాల్లో నియమించిన
400 మంది సలహాదారులు/నిపుణులను ఎల్జీ ఏకపక్షంగా తొలగించారు. పారదర్శకత
లేకుండా చేపట్టిన వారి నియామకాల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ వీకే సక్సేనా
తన చర్యలను సమర్థించుకున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఆప్ నేతలు
మండిపడ్డారు. ఎల్జీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.
సలహాదారులు, నిపుణులను తొలగించే అధికారం ఆయనకు లేదన్నారు.

కేంద్రం ఆర్డినెన్స్‌పై జులై 10న విచారణ : ఢిల్లీ లో గ్రూప్-ఎ అధికారుల
బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక
ఆర్డినెన్స్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల
నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం స్థానిక ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు
తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనిని ఆప్
తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు దీనిపై జులై
10న విచారణ జరిపేందుకు కోర్టు అంగీకరించింది.