స్టేట్ ట్రేడ్ ప్రమోషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు
భిక్షపతి, తన్వీర్
హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక సంఘం(స్టేట్ ఫైనాన్స్ కమిషన్) ఛైర్మన్‌గా మాజీ
ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. సంగారెడ్డి
జిల్లా రామచంద్రాపూర్‌కు చెందిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2015లో
భారాస(అప్పటి తెరాస)లో చేరారు. శాసనమండలి ఛైర్మన్‌గా కొంత కాలం పనిచేశారు.
సభ్యులుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్‌యాదవ్, నారాయణపేట్ జిల్లా
మద్దూర్ మండలం రెనెవట్లకు చెందిన మహమ్మద్ సలీం నియమితులయ్యారు. తెలంగాణ
స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా
వట్పల్లి మండలం మార్వెల్లికి చెందిన మటం భిక్షపతి, ఇండస్ట్రియల్
డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన
మహమ్మద్ తన్వీర్లను నియమించారు. భిక్షపతి గతంలో హైదరాబాద్ క్రికెట్
అసోసియేషన్ సభ్యుడు కాగా తన్వీర్ మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కుమారుడు.