మళ్లీ అధికారం మనదే : ధర్మాన కృష్ణదాస్
ఘనంగా ధర్మాన కృష్ణదాస్ జన్మదిన వేడుకలు
వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
నరసన్నపేట : నిజాయితీ గల రాజకీయ నాయకుడు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర
వేస్తారని అటువంటి ఉత్తమ లక్షణాలున్న మా దాసన్న మీ అందరి ప్రేమకు దాసుడని
రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం
ధర్మాన కృష్ణదాస్ జన్మదిన వేడుకలను స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రెవెన్యూ మంత్రి
ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజా జీవితాన ఉన్న వారికి ప్రజల సంతోషమే ప్రధాన ధ్యేయమని, అలాంటి వారు
ఇవాళ ఈ జన్మదిన వేడుకలు చేయడం ఆనందదాయకంగా ఉందని అన్నారు.
నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. మనమందరం ఒకే లక్ష్యం కోసం పని
చేస్తున్నాం అని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలనలో సరికొత్త
ఒరవడి తీసుకుని వచ్చామని అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఏమీ
పొందని వారు ఉన్నారు అని, ఏ ప్రయోజనం కానీ ఏ లబ్ధి కానీ పొందని వారిని
గుర్తించి వారికి ఆసరాగా నిలుస్తున్నామని చెప్పారు. అలాంటి వారికి అండగా
ఉండేందుకు రాజ్యాంగం లో పొందు పరిచిన విధంగా వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు
అనేక పథకాలు రూపకల్పన చేశామని తెలిపారు. ఇవాళ 31 లక్షల మందికి సొంత ఇంటి స్థలం
ఇచ్చామని వెల్లడించారు. అలానే పథకాల ద్వారా డబ్బు దుబారా అవుతుందని
చంద్రబాబు, అయనకు వెన్నుదన్నుగా ఉన్న ఎల్లో మీడియా విష ప్రచారం చేసినా
దానిని వైఎస్సార్ కార్యకర్తలంతా తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. పథకాలే
వృథా అన్న చంద్రబాబు మొన్నటికి మొన్న రాజమండ్రిలో ఈ ప్రభుత్వం కన్నా
ఎక్కువ డబ్బులు తాము అధికారంలోకి వస్తే ఇస్తామనడం విడ్డూరం అని
వ్యాఖ్యానించారు.
మళ్ళీ అధికారం మనదే : ధర్మాన కృష్ణదాస్
జన్మదిన వేడుకల్లో భారీగా తరలివచ్చిన అభిమానులను, పార్టీ నాయకుల్ని ఉద్దేశించి
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ
వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ అధికారం లోకి జగన్ వస్తారన్నారు. ప్రజలకు ఆర్థిక
అండగా ఉన్న రోజునే అసలైన అభివృద్ధి అని అభిప్రాయపడ్డారు. విద్యా,వైద్యం
పరంగా వారికి అండగా ఉండడం అన్నది ఓ ప్రభుత్వ విధి అని అన్నారు. ఆకలి
అన్నది దరి చేరకుండా మంచి చదువు ఉన్నరోజునే అసలైన అభివృద్ధి అని, ఇదే సీఎం
జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజ లకొసం చేస్తున్నది అని వివరించారు.
నిరక్షరాస్యులకు మంచి విద్య అందించి, ప్రపంచంతో పోటీపడాలి అనే విధంగా సంబంధిత
రంగంలో అనేక సంస్కరణలు చేపట్టాం అని తెలిపారు. ప్రభుత్వ రంగ వ్యవస్థలలో
అవినీతి పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకు
వచ్చామని, అలానే ఆంధ్రావనిని దేశంలోనే ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్న
విధంగా పాలన విషయమై పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని అన్నారు. జగనన్న
సురక్ష ద్వారా పాలనను మరింత స్థానికం చేశారన్నారు. అధికార యంత్రాంగం ఇవాళ
సామాన్యుడి గుమ్మానికే నేరుగా చేరుకుని సంబంధిత సేవలను అందిస్తున్నారని
చెప్పారు. జగనన్న సురక్ష ద్వారా 11 రకాల సేవలను ఇవాళ అందుబాటులోకి
తీసుకుని వచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని
అన్నారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి సమర్థ నాయకత్వాలకు మరోసారి అధికారం
అందించాలని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తన
పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా
ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వర రావు
అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా భారీ కేక్ కట్ చేశారు. ఈ సభలో మంత్రి
డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చే యువతకు ధర్మాన
కృష్ణదాస్ జీవితానుభవాలు ఉంతో మార్గదర్శకం చేస్తాయన్నారు. ఇలాంటి
పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సభలో బీసీసెల్
జోనల్ ఇన్ చార్జి డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, శాసనమండలి సభ్యులు నర్తు
రామారావు, దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, జెడ్పీ చైర్మన్ పిరియా విజయ,
ధర్మాన రామదాసు, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు
గొర్లె కిరణ్, విశ్వసరాయి కళావతి, కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరిబాబు,
పేరాడ తిలక్, పంగ కృష్ణవేణి భావాజి నాయుడు, రాజాపు హైమవతి అప్పన్న, చీపురు
రాణి, కృష్ణమూర్తి, సుడా చైర్మన్ కోరాడ ఆశాలత గుప్తా, నరసన్నపేట నియోజకవర్గం
లోని ఎంపీపీలు ఆరంగి మురళీధర్, వాన గోపి, ముద్దాడ దమయంతి భైరాగినాయుడు,
జెడ్పీటీసీలు చింతు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.