గుంటూరు : వైసీపీకి రాజకీయ సలహాలు అందిస్తోన్న ఐప్యాక్ టీమ్‌తో సీఎం జగన్
మోహన్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు
కార్యాలయంలో జరిగిన భేటీలో వైసీపీ ముఖ్యనేతలు, ఐప్యాక్ టీమ్ ఇన్‌ఛార్జి
రిషిరాజ్, సహ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తాజా
పరిణామాలపై చర్చించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తాజా పరిస్థితిపై సీఎం
విశ్లేషించారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోన్న
తీరుపై సీఎం సమీక్షించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల భాగస్వామ్యం,
పనితీరుపై చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీం ఇచ్చిన నివేదికలపై
సీఎం చర్చించినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలపై
సీఎం చర్చించారు. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేధాలు నెలకొన్న
పరిస్ధితుల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు, నియామకాలపై సమాలోచనలు
జరిపినట్టు తెలిసింది.