విజయవాడ : దిగువ న్యాయస్థానాల్లో రాహుల్ గాంధీ కి తీర్పులు వ్యతిరేకంగా
వచ్చినప్పటికీ మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని సుప్రీంకోర్టులో గెలిచి
తీరుతామని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర
కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ నుండి గాంధీ నగర్ లోని ధర్నా చౌక్ వరకు వందలాది
మంది కార్యకర్తలతో కార్యకర్త నాయకులతో కలిసి ర్యాలీగా నల్ల జెండాలతో, నల్ల
బ్యాడ్జీలు ధరించి ధర్నా చౌక్ కు చేరుకున్నారు. జయ జయ రాహుల్ గాంధీ అనే
నినాదాలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది ఏదేమైనాప్పటికీ కాంగ్రెస్ పార్టీకి
ఆటుపోట్లు అలవాటేనని 2024 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధర్నా చౌక్ వద్ద మీడియాతో అన్నారు.
నల్ల జెండాలు నల్ల రిబ్బన్లతో ధర్నా చౌక్ వద్ద నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.
అధ్యక్షులు రుద్రరాజు గారితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ,
విజయవాడ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, వి. గురునాధం, తాంతియా
కుమారి, ఏ.ఐ.సి .సి. సభ్యులు ధనేకుల మురళి, ఏ.ఐ.సి.సి. సభ్యులు మీసాల రాజేశ్వర
రావు, ఏ.ఐ.సి .సి. సభ్యులు మేడా సురేష్, కొలనుకొండ శివాజీ, ఏ.ఐ.సి .సి.
సభ్యులు కాజా మొహిద్దీన్, నాంచారయ్య, బైపూడి నాగేశ్వర రావు, పోతురాజు ఏసుదాసు,
సతీష్, ప్రకాష్, బేగ్, గౌస్, పీటర్ జొసఫ్, నాగూర్, మోహన్, ఖుర్షిదా, సునీత
తదితరులు పాల్గొన్నారు.