టిడిపి ప్రభుత్వం
దళితులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని జగన్ నిర్ణయించారు
దళితుల వ్యతిరేకిగా చంద్రబాబు పనిచేస్తే దళితుల పక్షపాతిగా జగన్
పనిచేస్తున్నారు
వైయస్సార్ సిపి ఎంపి నందిగమ్ సురేష్
పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సిఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన
వైయస్సార్ సిపి శ్రేణులు
గుంటూరు : 2017లో మాదిగల కురుక్షేత్ర సభలో పాాల్గొన్నవిద్యార్దులపై అప్పటి
ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. వాటిని తొలగించాలని దళిత నేతల నుంచి వచ్చిన
విజ్ఞాపనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ సానుకూలంగా స్పందించడంపై హర్షం
వ్యక్తం చేస్తూ శుక్రవారం తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంవద్ద
పార్టీ శ్రేణులు వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లోక్ సభ సభ్యుడు
నందిగమ్ సురేష్,మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావులతోపాటు పలువురు
దళితనేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిగమ్ సురేష్ మాట్లాడుతూ
తెలుగుదేశం ప్రభుత్వం గతంలో మాదిగల కురుక్షేత్ర సభలో పాల్గొన్న విద్యార్దులపై
అక్రమంగా కేసులు పెట్టిందన్నారు.విద్యార్దులు ఉన్నతచదువులు చదివినా కూడా ఆ
కేసులు కారణంగా పలు ఇభ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆర్దికంగా కూడా
నష్టపోాయారన్నారు. ఈ సమస్యను సిఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే ఆ
కేసులను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుంటానని స్పష్టంగా చెప్పారన్నారు.
ఎస్సీలకు ప్రయోజనం కలిగే ఎలాంటి అంశం అయినా తక్షణం అమలు చేస్తామని జగన్ తమకు
తెలియచేశారని అన్నారు. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం
దళితులపై అరాచకాలకు పాల్పడిందన్నారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు యధేచ్చగా
కొనసాగించిందని అన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని
వ్యాఖ్యానించారన్నారు. దళితులకు పదవులెందుకు అంటూ బరితెగించిన టిడిపి నేతలు
వ్యాఖ్యానించారన్నారు. జగన్ ఎస్సి, ఎస్టి, బిసిలు నా బంధువులు అని ఎప్పుడూ
చెబుతుంటారన్నారు. జగన్ దళితులకు అన్ని విధాలా అండగా ఉంటూ సంక్షేమపధకాలు
అందిస్తు్న్నారని అన్నారు. ప్రతి దళితుడు జగన్ కి అండగా ఉంటారని అన్నారు.
టిడిపిలో ఉండే దళితనేతలంతా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చంద్రబాబు
దళితులను టిష్యూ పేపర్ లాగా వాడారన్నారు. అదే జగన్ దళితులకు మేలు చేసే ఎన్నో
కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ఎస్సీ నియోజకవర్గలన్నింటిలో కూడా
వైయస్సార్ సిపి గెలిచిందన్నారు. రానున్న ఎన్నికలలో కూడా వైయస్సార్ సిపికి
ఘనవిజయం తధ్యం అన్నారు.
మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ తెలుగుదేశం
ప్రభుత్వం పెట్టిన కేసుల కారణంగా విద్యార్దులు చాలా ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారని అన్నారు. జగన్ ఓట్ల కోసం అని కాకుండా దళితులను అన్ని
విధాలా పైకి తీసుకురావాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారని అన్నారు. మంత్రివర్గం
నుంచి నామినేటెడ్ పదవులలో సైతం ఎస్సి,ఎస్టి,బిసి, మైనారిటీలకు ప్రాధాన్యత
ఇచ్చారన్నారు.