విజయవాడ : “జర్నలిజం – కాలానుగుణ మార్పుల ఆవశ్యకత” అంశం పై సీనియర్
జర్నలిస్ట్ అప్పాజి రెడ్డెం, “సంపూర్ణ ఆహారం – మెరుగైన జీవనం” అంశంపై శ్రీ
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రిజిస్ట్రార్ , ప్రొఫెసర్ ఎన్.రజని
ప్రసంగిస్తారని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు
తెలిపారు. “డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులతో పాటు, రాష్ట్రంలోని
వర్కింగ్ జర్నలిస్టులకు సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యం లో ప్రతి శనివారం
నిర్వహిస్తోన్న “ఆన్ లైన్ అవగాహనా తరగతుల్లో” భాగంగా శనివారం (08-07-23) న
“జర్నలిజం – కాలానుగుణ మార్పుల ఆవశ్యకత” అనే అంశం పై ఆంగ్ల దినపత్రిక ది
హిందూ, రెసిడెంట్ ఎడిటర్ అప్పాజీ రెడ్డెం శనివారం ఉదయం 8నుంచి 9 గంటల వరకు
ప్రత్యేక ప్రసంగం చేస్తారని ఆ సంస్థ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక
ప్రకటనలో తెలిపారు. “సంపూర్ణ ఆహారం – మెరుగైన జీవనం” అంశం పై శ్రీ పద్మావతి
మహిళా విశ్వవిద్యాలయం, రిజిస్ట్రార్ , ప్రొఫెసర్ ఎన్.రజని ఉదయం 9నుంచి 10గంటల
వరకు “ ప్రత్యేక ప్రసంగం ఇస్తారని, జర్నలిజం” కోర్సు విద్యార్థులు,
వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి
చేశారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ గా తాము అధ్యక్షత వహిస్తామని, మీడీయా
అకాడమి కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర తిలక్, కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్
ఎల్.వి.కె. రెడ్డి పరిచయ కర్తగా, మీడియా అకాడమీ కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్
బాబు సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని చైర్మన్ ఆ ప్రకటనలో తెలిపారు.