పార్వతీపురం : రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా వైకాపా నేత, మాజీ ఎంపీ
డాక్టర్ డీవీజీ శంకరరావును ప్రభుత్వం నియమించింది. ఈ బాధ్యతలు స్వీకరించిన
నాటి నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఇటీవల చేపట్టిన ఎమ్మెల్సీ
స్థానాల భర్తీలో వైసీపీ అధిష్ఠానం ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన శంకరరావు
పేరునూ పరిశీలించినప్పటికీ చివరి క్షణంలో పక్కన పెట్టింది. తాజాగా ఎస్టీ
కమిషన్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించింది. శంకరరావు 1999-2004 మధ్య పార్వతీపురం
లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. గత
ఎన్నికల్లో సీపీఐ నుంచి పాలకొండ శాసనసభ స్థానానికి పోటీ చేశారు. ఏడాది కిందట
వైసీపీలో చేరారు. ప్రస్తుతం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాల ఆచార్యునిగా
పనిచేస్తున్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని
తెలిపారు.

మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం
యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య
ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవిని మరోసారి ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు కట్టబెట్టి
మైదాన ప్రాంత గిరిజనులకు సీఎం జగన్ అన్యాయం చేశారని యానాదుల సంక్షేమ సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మండిపడ్డారు. ‘ఎస్టీ కమిషన్ ఛైర్మన్,
సభ్యులు, అన్ని పదవులూ ఏజెన్సీ ప్రాంత వాసులకేనా? గిరిజన జనాభాలో సగభాగం ఉన్న
మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం చేయడం దారుణం. మైదాన ప్రాంత గిరిజనులందరినీ
ఐక్యం చేసి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం’ అని ఆయన ఒక
ప్రకటనలో దుయ్యబట్టారు.