వరంగల్: కేంద్రం ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర
మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాలు
కల్పిస్తున్నామని చెప్పారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన
విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల
కోట్ల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కోసం
అంకిత భావంతో పని చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. మోదీ
ప్రధాని అయ్యాక జాతీయ రహదారులు మెరుగయ్యాయన్నారు. ‘‘ రాష్ట్రం కోసం కేంద్రం
అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. రూ.720 కోట్లతో సికింద్రాబాద్
స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.1900 కోట్లతో హైదరాబాద్-వరంగల్
రహదారిని మంజూరు చేశాం. ఇవాళ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి
శంకుస్థాపన చేయనున్నాం. దీని ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తాయని కిషన్రెడ్డి
అన్నారు.