సోనిపట్ : హర్యానా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రైతులతో కలిసి వ్యవసాయ పనులు
చేశారు. ట్రాక్టర్‌తో దుక్కి దున్ని వరి నాటేశారు. కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీ రైతుగా మారారు. శనివారం ఉదయం హర్యానాలోని సోనిపట్‌లో ఆకస్మికంగా
పర్యటించిన ఆయన పొలంలోకి దిగి ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. నాట్లేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ తమ ట్విటర్ ఖాతాలో పంచుకోగా
ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. ఢిల్లీ నుంచి సిమ్లా వెళ్తున్న ఆయన
మార్గమధ్యంలో సోనిపట్‌లో ఆగారు. బరోడా, మదీనాలోని పలు గ్రామాల్లో తిరిగిన ఆయన
పొలం పనుల్లో ఉన్న రైతులతో ముచ్చటించారు. ఆ తర్వాత పొలంలోకి దిగి ట్రాక్టర్
నడిపారు. రైతులతో కలిసి వరి నాట్లేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత నుంచి రాహుల్ ఈ మధ్య కాలంలో అనేక రంగాలకు
చెందిన ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవల ఢిల్లీ – చండీగఢ్ హైవేపై ట్రక్కు
నడిపి లారీ డ్రైవర్ల సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఆయన ఆ తర్వాత ఓ మెకానిక్
దుకాణంగా బండిని రిపేర్ చేస్తూ కన్పించారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన
సమయంలోనూ రాహుల్ ట్రక్కులో ప్రయాణించిన విషయం తెలిసిందే. కాగా గత లోక్‌సభ
ఎన్నికల సమయంలోనూ రాహుల్ ట్రాక్టర్ నడిపారు.