ఇప్పటికే రూ.25,500 కోట్లు అప్పు
తాజాగా మరో రూ.2 వేల కోట్ల సమీకరణ
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణం రూ.27,500
కోట్లకు చేరనుంది. ఇప్పటికే రూ.25,500 కోట్లు అప్పు తీసుకున్న ప్రభుత్వం ఈ నెల
11న మంగళవారం మరో రూ.2 వేల కోట్ల రుణం సమీకరించనుంది. 18 ఏళ్ల కాలపరిమితితో
రూ.1,000 కోట్లు, 19 ఏళ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు అప్పు చేసేందుకు
సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొననున్నట్లు ఏపీ ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు
సమాచారమిచ్చింది. తాజా అప్పులతో కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 90
రోజుల్లోనే ప్రభుత్వం రూ.27,500 కోట్ల రుణం తీసుకున్నట్లవుతుంది.