రాష్ర్ట మంత్రి మేరుగు నాగార్జున,ఎంపి నందిగమ్ సురేష్, శాసనమండలి ఛీఫ్ విప్
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి,
కల్పలతారెడ్డి, పార్టీ నేతలు, కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరక్టర్లు,అనుబంధ
సంఘాల నేతలు
పేదలకు దుస్తులు పంపిణి, రక్తదాన శిబిరం,అన్నదానం కార్యక్రమాలను ప్రారంభించిన
పార్టీ నేతలు
వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు. తండ్రి
అడుగుజాడల్లో వైయస్ జగన్ నడుస్తున్నారు
వైయస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ ప్రజల మన్ననలు పొందారు
వైయస్ ఆర్ ఆశయాలను, లక్ష్యాలను నెరవేరుస్తున్న వైయస్ జగన్
వైయస్ఆర్ లాగే ప్రజల హృదయాలలో నిలిచేలా పరిపాలన అందిస్తున్న వైయస్ జగన్
వైయస్ ఆర్ మరణించినా ఆయన పాలన ఆగలేదు
వైయస్ జగన్ ఆ పాలన కొనసాగిస్తున్నారు
వైయస్ ఆర్ రూపంలో వైయస్ జగన్ ప్రజలకు కనిపిస్తున్నారు
ఈ తరం యువతకు వైయస్ జగన్ తండ్రి వైయస్సార్ అని గర్వంగా చెప్పుకునేలా పరిపాలన
అందిస్తున్నారు
ప్రతి కార్యకర్త తాము జగనన్న మనుషులం అని గర్వంగా చెప్పుకునేలా వైయస్ జగన్
పాలన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను అన్నింటా అగ్రగామి గా నిలిపేలా వైయస్ జగన్
అడగులు వేస్తున్నారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
గుంటూరు : దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల్లో గుండెల్లో
ఎప్పటికీ పదిలంగా ఉంటారని, ఆ మహామనిషిని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహానేత
వైయస్ఆర్ మరణించినా ఆయన పాలన కొనసాగుతోంది. వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు
అనుగుణంగా ఆయన తనయుడు సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.
తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దివంగత మహానేత
వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత
విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను
కట్ చేశారు.పేదలకు వస్ర్తాలను పంపిణి చేశారు. కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన
రక్తదాన శిబిరాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,ఎంపి
శ్రీ నందిగమ్ సురేష్ ప్రారంభించారు. పలువురు వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు
రక్తదానం చేశారు. అనంతరం శ్రీ సజ్జల రామకష్ణారెడ్డి మాట్లాడుతూ… సీఎం శ్రీ
వైయస్ జగన్ రూపంలో వైయస్‌రాజశేఖరరెడ్డి ఉన్నారని తెలియచేశారు. వైయస్ఆర్
ఆత్మశాంతి కలిగేలా సీఎం శ్రీ వైయస్ జగన్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారని
తెలిపారు. ఈ తరం యువత సీఎం శ్రీ వైయస్ జగన్ తండ్రి వైయస్ఆర్ అని గర్వంగా
చెప్పుకునేలా పరిపాలన చేస్తున్నారని వివరించారు.మేం రాజన్న బిడ్డలం…జగనన్న
మనుషులం…జగన్న అనుచరులం…జగనన్న సహచరులం ఆయన కుటుంబసభ్యులం అని లక్షలాది
మంది వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు గర్వంగా చెప్పుకునేలా పరిస్దితి
ఉంది.ప్రజలు కూడా మా ఆంధ్రప్రదేస్ కు బ్రహ్మాండమైన నాయకుడు మాకు దొరికాడని
భావిస్తున్నారు.రాష్ర్ట విభజన తర్వాత ఐదేళ్ళు ఎవరి చేతుల్లో పడకూడదో ఆయన
చంద్రబాబు చేతుల్లో పడింది. వైయస్ఆర్ మరణించినా ఆయన పాలన మన కళ్లముందే
మరింత మెరుగ్గా ఉంది. వైయస్ఆర్ తనయుడు సీఎం జగన్ సువర్ణ పాలన
అందిస్తున్నారు. వైయస్ఆర్ పాలన ఇలాగే ఉండేదా అని ఈతరం వారు అనుకునేలా
పరిపాలన చేస్తున్నారు. తండ్రి వెళ్తూ వెళ్తూ తన కుమారుడ్ని మనకు అప్పగించి
వెళ్ళారన్నారు. తన కుమారుడికి మనల్ని అప్పజెప్పి వెళ్లడం ప్రపంచంలోనే అరుదుగా
జరిగే సంఘటన అని అన్నారు.2009 పార్లమెంట్ ఎన్నికల్లో తన కొడుకు శ్రీ వైయస్
జగన్‌ను మహానేత వైయస్ఆర్ ప్రజలకు అంకితం చేశారు. ఆ తరువాత దురదృష్టవశాత్తు
కొద్ది కాలంలోనే వైయస్ఆర్ మనకు దూరమయ్యారు.
2009 సెప్టెంబర్ రెండో తేదీన వైయస్సా ఆర్ ఎప్పుడైతే మరణించారో
,అందరికి మనోవేదన కలిగింది.అయితే ఆ జర్నీ ఆగలేదు. శ్రీ వైయస్ జగన్ రూపంలో
ఆరోజు నుంచి ఆ అడుగులు మరింత బలంగా పడుతూ వస్తున్నాయి. వైయస్ఆర్ సీఎం శ్రీ
వైయస్ జగన్ రూపంలో ఉన్నారు. వైయస్ఆర్ ,సిధ్దాంతాలకు,మంచితనం, ప్రేమ,
దార్శనికత, ప్రతి లక్షణం మరింత మెరుగ్గా, పదునుగా, ప్రేమపూర్వకంగా సీఎం శ్రీ
వైయస్ జగన్ ద్వారా చూస్తున్నాం. మంచి కొడుకుగానే కాకుండా మంచి వారసుడిగా
జగన్ నిలిచారు. వైయస్ఆర్ ఆలోచనలు, సిద్ధాంతాలకు, ప్రేమకు, దార్శనికతకు సీఎం
జగన్ వారసుడిగా నిలిచారు. ఇలాంటి ఘనమైన నాయకుడి ఆశయాల దిశగా అడుగులు
వేస్తున్నాం. ఇందుకు మనందరం కాలర్ ఎగరేసుకొని వైయస్ఆర్ కుటుంబ సభ్యులమని
గర్వంగా చెప్పుకుంటున్నాం అని అన్నారు.
రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సుభిక్షంగా, సుసంపన్నంగా, ప్రశాంతంగా,
సుఖశాంతులతో ఉంటుందో ఆ నాయకుడి చేతుల్లోనే ప్రస్తుతం ఉంది. ఆయనే సీఎం జగన్.
ఈతరం యువత వైయస్ఆర్ ఎవరంటే సీఎం జగన్ తండ్రి అని చెప్పుకునేలా పాలన
సాగిస్తున్నారు. అంతకంటే ఏ తండ్రికి తృప్తి, ఆత్మశాంతి ఉండదు. పాలనా పరంగా
డీసెంట్రలైజేషన్, పధకాలన్నీ కూడా డిబిటి రూపంలో చేర్చడం అయితే కానీవ్వండి.
అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శకతతో అందించడం కానీవ్వండి. డెడ్
లైన్ పెట్టి మరీ ఎవరికి రావాల్సినవి వారికి అందిస్తున్నారు. వీటన్నింటిలో
శాచ్యురేషన్ బేసిస్ లో ఇవ్వడం జరుగుతోంది. వివక్షకు,అవినీతికి తావు లేకుండా
చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా డెలివరీ సిస్టమ్ ను నిర్మించారు. మరోవైపు
సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికంటే ముందు స్పందన కార్యక్రమం
ద్వారా సమస్యలు పరిష్కారం కోసం నాలుగేళ్లుగా కొనసాగుతోంది.తర్వాత జగనన్నకు
చెబుదాం ప్రోగ్రాం ద్వారా రెండోస్టేజ్ లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం
కిందిస్దాయి వరకు ప్రయత్నించారు. ఇంకా ఎవరైనా మిగిలిఉంటే వారిని వెదికి మరీ
అంటే ఇంటింటికి వెళ్ళి ఎందుకు ప్రయత్నించకూడదు అని ఇప్పుడు మొదలు పెట్టిన
యజ్ఞం ఈ సురక్ష కార్యక్రమం. దీనిద్వారా ఎంత త్వరితంగా సమస్యలకు పరిష్కారం
దొరుకుతుందో అందరికి తెలుసు. కొద్ది రోజులలోనే 61 లక్షల ఇళ్ళు మన కార్యకర్తలు
టచ్ చేసి వారి సమస్యలకు పరిష్కారం చూపారు. వారం రోజులలో 15 వేల సచివాలయాలలో
4వేల క్యాంపులు జరిగితే 14 లక్షల సర్వీసులు డెలివరీ చేశాం. ఇది దేశ చరిత్రలోనే
రికార్డు.24 గంటల్లో మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతోంది.
కలలు ఎవరైనా కనవచ్చు లేదా పగటి కలలు కనచ్చు చంద్రబాబులాగానో, ఆయన కొడుకులాగానో
లేదా చంద్రబాబు దత్తుడు లాగానో నిజరూపం చేయాలంటే డెలివరీ సిస్టమ్ కిందిస్దాయి
వరకు ఏర్పాటు చేయాలి అది వైయస్ జగన్ చేసి చూపించారు. ఈరోజు 50 నుంచి 70 ఇళ్ళకు
వాలంటీర్లను నియమించడం ద్వారా సచివాలయాలను కేంద్రబిందువు చేసి సర్వీసులు
ఇవ్వడం ద్వారా అందులో ఫుల్ పెడ్జ్ డ్ ఉద్యోగులను నియమించారు. బటన్ నొక్కితే
పధకాలు లబ్దిదారులకు చేరుతున్నాయి.ప్రతిదీ సిస్టమ్ ఏర్పాటుచేశారు. అధికారం
కాదు ప్రజలు ఇచ్చింది బాధ్యత అని గుర్తెరిగి జగన్ పనిచేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లోనే ఈ సిస్టమ్ ను ఏర్పాటుచేశారు. కోవిడ్ లాంటి
విపత్కర పరిస్దితులను ప్రపంచం సరిగా ఎదుర్కొకపోయినా రాష్ర్టంలో
ఎదుర్కోగలిగారు. ఈరోజు ప్రతిపక్షాలు గావుకేకలు పెట్టినా,రంకెలు వేసినా వాటిని
పట్టించుకునే పరిస్దితిలో ప్రజలు లేరు. భీమా సక్రమంగా అందుతుంది అంటే ఈ
సిస్టమే కారణం. క్యాలెండర్ పెట్టి ఏ నెలలో తమకు ఏది వస్తుంది అని
ప్రణాళికబద్దంగా తెలుసుకునేలా చేసిన ఘనత జగన్ ది. సంవత్సరానికి కనీసం
లక్షరూపాయలు అందేలా చేశారు. కోటి నలభై లక్షల కుటుంబాలకు అందేలా ఎవరైానా చేశారా
అని ప్రశ్నించారు. బ్యాంకులు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడానికి ముందుకు
వస్తున్నాయి.అంటే ప్రభుతవం భరోసా కల్పించింది. 30 లక్షల మందికి ఇంటి స్ధలాలు
ఇచ్చారు. వైయస్ ఆర్ అంశ ఇదంతా జగన్ ద్వారా చేయిస్తోందని తెలియచేశారు. ఇలా
జగన్ కష్టపడుతున్నారు కాబట్టే ప్రజలంతా తిరిగి జగనన్నే ముఖ్యమంత్రి కావాలని
కోరుకుంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు చీకటి రాజ్యాన్ని కూడా కార్యకర్తలు
ప్రజలకు తెలియచేయాలి. వైయస్సార్ పేటెంట్ ఇది. జగన్ పేటెంట్ ఇది అని
చెప్పుకునేందుకు చాలా ఉన్నాయి. చంద్రబాబు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా
చేసినా అళా చెప్పుకునేందుకు ఒక్కటి కూడా లేదు. సీఎం జగన్ వేస్తున్న అడుగులు
రాష్ట్రాన్ని దేశంలోనే అన్నింటా అగ్రగామిగా నిలిపేలా ఉన్నాయి. మంచి పరిపాలన,
ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు. మరో ఐదేళ్లలో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలబడే
గట్టి పునాదులు ఇప్పటికే పడ్డాయి. ఒక వ్యవస్దకు అధినేత అన్ని వ్యవస్థలను సీఎం
జగన్ రిపేర్ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. భవిష్యత్తుపట్ల దూరదృష్టి,
ఆలోచనలు సమన్వయంతో వెళ్లే శక్తి సామర్ధ్యాలు,నాడు వైయస్సార్ లో నేడు శ్రీ
వైయస్ జగన్ లో ఉన్నాయన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలను
సీఎం వైయస్ జగన్ వందకు 200 శాతం, నిబద్ధతతో, దార్శనికతతో అమల్లోకి
తీసుకువచ్చి ఫలితాలు సైతం చూపిస్తున్నారు. ఎవరు ఏ సర్వే చేసినా 70 నుంచి 80
శాతం మంది మాకు జగనన్నే కావాలి.. ఆయనే ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా
పరిపాలించాలి…..మా బతుకులు ఆయన చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటాయని రాష్ర్ర
ప్రజలు అంటున్నారు. అధికారాన్ని బాధ్యతగా భావిస్తూ పరిపాలన చేస్తున్నారు
కాబట్టే తక్కువ సమయంలోనే అనేక మేలైన ఫలితాలు నిజమైన అభివృధ్దితో
తీసుకురాగలిగారని అన్నారు.ఇది కంటిన్యూ అవుతుందనే ఏమరపాటుగా ఉండకుండా
కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
ప్రజలు అప్పగించిన అధికారమనే బాధ్యతను శాశ్వతం చేసేరకంగా సీఎం శ్రీ వైయస్
జగన్‌ను పర్మినెంట్‌గా ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా ఉంచేలా ముఖ్యమంత్రిగా
కంటిన్యూ అయ్యేటట్లుగా పార్టీ శ్రేణులు ప్రజల్లో మమేకమైమవ్వాలి. వారి అవసరాలు
తీర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన 1.40 కోట్ల మందిని బ్రాండ్
అంబాసిడర్లుగా నిలబెట్టేలా ముందుకుసాగాలని సజ్జల రామకృష్ణారెడ్డి అభిలషించారు.
జయంతి ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ అభిమానులు
స్మరించుకుంటున్నాం.ప్రతి సంవత్సరం రాష్ర్టానికి,రాష్ర్ట ప్రజలకు పునరంకితం
కావడానికి ఇదొక సందర్బంగా మనం తీసుకుంటూ అందరికి శుభాకాంక్షలు
తెలియచేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సి సెల్ రాష్ర్ట
అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్
రెడ్డి,ఎస్ .ఎం జియాఉధ్దీన్,ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి,లిడ్ క్యాప్ ఛైర్మన్
కాకుమాను రాజశేఖర్,నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి తదితరులు
పాల్గొన్నారు.