అభినందనలు
భాగస్వామ్య సంఘాల మద్దతు తోనే 92 రోజుల ఉద్యమం ముందుకు సాగింది
మహిళా సంరక్షణ కార్యదర్శి ని మహిళా పోలీసు గా కాకుండా మహిళా సంరక్షణ
కార్యదర్శి గానే కొనసాగించాలి
మిగిలిపోయిన సమస్యలు కూడా సాధించేందుకు కృషి
నెల్లూరు అభినందన సభలో బొప్పరాజు & పలి శెట్టి దామోదర్ రావు
నెల్లూరు : ఏపీ జెఎసి అమరావతి అన్నీ జిల్లాల చైర్మన్ ప్రధాన కార్యదర్శులు,
వారి కార్యవర్గ సభ్యులు, ఏపీ జేఏసీ అమరావతి లోని వివిధ భాగస్వామ్య సంఘాల
మద్దతుతోనే ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో చేసి ప్రభుత్వం ద్వారా అనేక సమస్యలు
పరిష్కరించుకొని సాధించుకున్నామని ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలి శెట్టి దామోదర్ రావు లు పేర్కొన్నారు. ఆదివారం
నెల్లూరు నగరంలోని హోటల్ శివం నందు ఏపీ జెఎసి అమరావతి ఉద్యమం ముగిసిన
సందర్భంగా ఏడు జిల్లాల (ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, తిరుపతి
చిత్తూరు) నాయకత్వానికి అభినందన సభ జరిగింది. నెల్లూరు జిల్లా ఏపీ జేఏసీ
అమరావతి చైర్మన్ అల్లం పాటి పెంచల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు,
టివి ఫణి పేర్రాజు, వివి మురళి కృష్ణ నాయుడు తదితరులు ముఖ్య అతిథిలుగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బొప్పరాజు
వెంకటేశ్వర్లు పలిసెట్టి దామోదర్ రావు మాట్లాడుతూ 92 రోజులు ఉద్యమంలో ఎన్నో
విభాగాల ఉద్యోగ సమస్యలను తెలుసుకుని డిమాండ్ల రూపంలో ప్రభుత్వం ముందు ఉంచడం
జరిగిందని తెలియజేశారు. సమిష్టిగా కృషి అంకితభావంతో ఉద్యమాన్ని నడపబట్టే
ప్రభుత్వం చర్చలకు పిలిచి సహృద్భావ వాతావరణంలో సమస్యలు పరిష్కరించారని
తెలియజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం శుభ పరిణామనీ మిగిలిన
వారిని కూడా సహృదయంతో వారి బాధలను, ఆవేదనను దృష్టిలో ఉంచుకొని, ఆవసరమైతే 5
సంత్సరకాలo నిబంధనలు సడలించి వారికి కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని
కోరారు. అలాగే మహిళా సంరక్షణ కార్యదర్శలను మహిళా పోలీసు గా పరిగణించి, వారిచే
పోలీసు విధులు నిర్వర్తించే విధంగా (అనగా బందోబస్తు, నైట్, స్టేషన్ డ్యూటీ,
టెంపుల్ తదితర పోలీసు విధులు) ఒత్తిడి ఉన్న కారణంగా వాళ్ళు తీవ్ర ఆందోళనకు
గురి అవుతున్నారని, కనుక ఇష్టం లేని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా
కార్యదర్శి గా నే కొనసాగించాలని, కోర్టు కేసుల వలన ప్రభుత్వానికి మానస
పుత్రికలైన గ్రామ వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శులు తీవ్రంగా ఆర్థికంగా దెబ్బ
తింటున్నారని, కనుక ఇష్టం లేని వారిని మహిళా కార్యదర్శి గానే కొనసాగించాలని
కోరారు. అన్ని అవరోధాలు చేదించి సమస్యల సాధనలో తోడ్పాటునందించిన అన్ని
భాగస్వామ్య సంఘాలకు ఏపీ జెఎసి అమరావతి అండగా ఉంటుందన్నారు. ఔట్సోర్సింగ్
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు దాటవేత ధోరణితో
ఉండడం వలన అనేక మంది కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు
గురవుతున్నారని, అటువంటి సమస్యలు అన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని
ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
చిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ ఏపీ జెఎసి అమరావతి వారి అండగా నిలబడుతుందని
తెలిపారు. నెలలు తరబడి జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని, ఇక నుండి ఏపీ జేఏసీ
అమరావతి వారందరు సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి
పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. అలాగే ఏపీ జెఎసి అమరావతి తొంబై రెండు
రోజుల ఉద్యమంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకునేటట్లు ప్రింట్ అండ్
ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జేఏసీ అమరావతికి మద్దతుగా నిలబడి సమస్యలను
పరిష్కార మార్గంలో చొరవ చూపినందుకు మీడియా కూడా అభినందనలు తెలిపారు. అభినందన
సభలో నెల్లూరు జిల్లా చైర్మన్ పెంచల్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి ప్రసాద్
,చిత్తూరు జిల్లా చైర్మన్ అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, తిరుపతి
చైర్మన్ గోపీనాథ్ రెడ్డి, గుంటూరు చైర్మన్ సంగీతరావు, ప్రధాన కార్యదర్శి కిరణ్
,బాపట్ల చైర్మన్ కే సురేష్ ప్రధాన కార్యదర్శి , ప్రకాశం జిల్లా చైర్మన్ ఆర్ వి
కృష్ణమోహన్, పల్నాడు జిల్లా చైర్మన్ కే నాగమల్లేశ్వరరావు జేఏసీ అమరావతి
రాష్ట్ర నాయకులు టీ ఫణి పేరాజు సంసాన శ్రీనివాస్ రావు, ఎస్ మల్లేశ్వరరావు,
వసంత రాయలు , కుమార్ రెడ్డి, శివకుమారి రెడ్డి ఆర్లయ్య తదితరులు పాల్గొన్నారు.