విజయవాడ : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అరుదైన గౌరవం దక్కింది. వివిధ
రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర
జనరల్ అసెంబ్లీ, సెనేట్లో సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సెనేటర్
డయాగ్నన్, జనరల్ అసెంబ్లీ సభ్యులు కారాబిన్చక్, స్టేన్లీ ఈ సంయుక్త
తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానపత్రాన్ని గుర్తిస్తూ సెనేట్
ప్రెసిడెంట్ నికోలస్ పిస్కటారి, జనరల్ అసెంబ్లీ స్పీకర్ కైగ్ జె కప్లిన్
సంతకాలు చేశారు. ‘‘న్యూజెర్సీతో పాటు అమెరికావ్యాప్తంగా ప్రవాస భారతీయుల
ప్రయోజనాల కోసం వెంకయ్యనాయుడు విశేషకృషి చేస్తున్నారు. భారత్లో విశేష
ప్రజాభిమానాన్ని చూరగొన్న ఆయన సామాజిక చైతన్యానికి ప్రయత్నిస్తున్నారు. 2017
నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. ఆ పదవి అలంకరించక ముందు
కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. భారత్, అమెరికా మధ్య
రాజకీయ, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఆయన కృషిని గౌరవిస్తూ ఈ
సంయుక్త సభ ఆయన సేవలను గుర్తించడం సబబు’’ అని తీర్మానంలో ప్రశంసించింది.
పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియాలోని కన్వెన్షన్ సెంటర్లో శనివారం
జరిగిన తానా 23వ మహాసభల సందర్భంగా న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ సభ్యుడు
స్టేన్లీ ఈ తీర్మాన పత్రాన్ని వెంకయ్యనాయుడికి అందించారు. వసుధైక కుటుంబ
స్ఫూర్తి ధర్మాన్ని ఆచరించే భారతీయులకు దక్కిన గౌరవంగా దీన్ని భావిస్తున్నట్లు
వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు.