జలిల్ ఖాన్ కేశినేని నానీ అభివృద్ధిని గాలికి వదిలేశారు- వెలంపల్లి
జలీల్ ఖాన్ ఇంటి రోడ్ కూడా నేనే వేసా – వెలంపల్లి
వాలంటరీ వ్యవస్థ పై పవన్ మాటలు హెయం- వెలంపల్లి
ప్రజలకు మేలు చేసే వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ- వెలంపల్లి
పవన్ కి సిగ్గు శరం లేదు – వెలంపల్లి
పవన్ వ్యాఖ్యలపై బీజేపీ సమాధానం చెప్పాలి – వెలంపల్లి
విజయవాడ : స్థానిక 49వ డివిజన్ టైలర్ పేట లో రెల్లి కమ్యూనిటీ హాల్
నిర్మాణానికి సోమవారం నాడు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ
సీఎం అభివృద్ది నిధుల నుండి 25లక్షల రూపాయలతో నిర్మిస్తున్నట్లు
తెలిపారు.పునర్ నిర్మాణం చెయ్యాలని మా దృష్టికి రావటం సంఘం సభ్యులు తెలిపారు
దాని అనుగుణంగా వెంటనే నిర్మాణానికి శంఖుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు.మూడు
నాలుగు నెలలో నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు.నగరాన్ని అభివృద్ధి చేసందుకు సీఎం
పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు.నియోజకవర్గంలో రోడ్లు అన్ని వేస్తున్నాం
అన్నారు.జలిల్ ఖాన్ నానీలు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి
వదిలేశారన్నారు.జలీల్ ఖాన్ ఇంటి రోడ్ కూడా నేనే వేసా అని గుర్తుచేశారు.
అమరావతి పేరుతో విజయవాడ నగర అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. కొత్త
పైపులైన్లు కూడా వేస్తున్నాం అని తెలిపారుపార్కులు అన్ని అభివృద్ది
చేశామన్నారు. వాలంటరీ వ్యవస్థ పై పవన్ మాటలు హెయం అన్నారు.ప్రజలకు మేలు చేసే
వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ కి లోక జ్ఞానం
లేదన్నారు.మహిళలను హేళన చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు.పవన్ కి
సిగ్గు శరం లేదన్నారు.పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ వ్యక్తి అని అన్నారు. అవ్వ తాతలకు
సేవ చేసే వ్యక్తులు వాలంటరీలు అని కొనియాడారు.పవన్ వ్యాఖ్యల పై బీజేపీ వాళ్ళు
సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి,స్థానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్,55వ డివిజన్
కార్పొరేటర్ శీరంశెట్టి పూర్ణచంద్రరావు, రెల్లి జన సంక్షేమ సంఘం అధ్యక్షులు
చెన్నా రాజు,కార్యదర్శి మీసాల సాంబశివరావు,తదితర కమిటీ సభ్యులు పార్టీ నాయకులూ
కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.