విజయవాడ : వివిధ దేశాల ఇమ్మిగ్రేషన్ చట్టాలపై అవగాహన కల్పించడం, న్యాయవాద
వృత్తిలో ఇమ్మిగ్రేషన్ విభాగంలో ఉపాధి
అవకాశాల అవగాహన కోసం బెజవాడ బార్ అసోసియేషన్, కావేటి లా ఫర్మ్ సంయుక్త
ఆధ్వర్యంలో సెమినార్ జరుగనుంది. ఈనెల 11 వ తేదీ మధ్యాహ్నం గం. 12.30 ని.లకు
బకింగ్ హార్మ్ పేట బెజవాడ బార్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో
నిర్వహించే ఈ కార్యక్రమంలో కావేటి లా ఫర్మ్ అధినేత, ప్రముఖ అంతర్జాతీయ
న్యాయవాది కావేటి శ్రీనివాసరావు ప్రసంగిస్తారు. బెజవాడ బార్ అసోసియేషన్
అధ్యక్షులు కేబి సుందర్, ప్రధాన కార్యదర్శి జె. శ్రీధర్ కార్యక్రమం
నిర్వహిస్తారు.
వివిధ దేశాల ఇమ్మిగ్రేషన్ చట్టాల తో పాటు ప్రవాస భారతీయుల న్యాయ వివాదాలు,
అంతర్జాతీయ న్యాయవాద వృత్తిలో
స్థిరపడాలని యోచిస్తున్న యువ న్యాయవాదులకు అవగాహన కల్పించడం, ఇంటర్నేషనల్ లా
ఫర్మ్ లో ఇంటర్న్ షిప్ అవకాశాలు, విదేశాల్లో స్థిరపడే యోచనలో ఉన్న
ఔత్సాహికులకు సరైన మార్గదర్శనం చేసే ఉద్దేశంతో ఈ సెమినార్ ఏర్పాటు చేయడం
జరిగింది. ఈ అవకాశాన్ని న్యాయవాదులు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాద వృత్తిలో
స్థిరపడాలని యోచిస్తున్న యువ న్యాయవాదులు, విద్య, ఉద్యోగ అవకాశాల ద్వారా
విదేశాల్లో స్థిరపడాలని యోచిస్తున్న విద్యార్థులు వారి తల్లితండ్రులు ఈ
సదవకాశాన్ని వినియోగించుకుని వివిధ దేశాల ఇమ్మిగ్రేషన్ చట్టాలు, అవకాశాలపై
అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి
చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు.