ప్రార్థనలు
విజయవాడ : రానున్న ఎన్నికల్లో జనసేన గెలిచి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని
గంగానమ్మ ముత్యాలమ్మ వారిని ప్రార్థించినట్లు జనసేన విజయవాడ నగర అధికార
ప్రతినిధి , ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ ( ఐజా) చెప్పారు. మంగళవారం
చిట్టినగర్ లోని లంబాడీ పేటలో వేంచేసి ఉన్న గంగానమ్మ ముత్యాలమ్మ ఆలయ బోనాల
జాతరలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బంజారాస్ కమిటీ సభ్యులు టి. మైనర్
బాబు, వారి బృందం ఆహ్వానం మేరకు ఈ బోనాల జాతరలో ఐజా పాల్గొనగా ఆయనకు ఆలయ
మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గయాజుద్దీన్ మాట్లాడుతూ ఎంతో
భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునే ఈ బోనాలు జాతరలో పాల్గొనడం తనకు ఎంతో
సంతోషంగా ఉందని అన్నారు. ముత్యాలమ్మ గంగానమ్మ వార్ల ఆశీస్సులు ప్రజలందరికీ
ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్
అభ్యర్థులు ఆలమూరి సాంబశివరావు, టీ. మహేంద్ర బాబు, దుర్గారావు, కమిటీ సభ్యులు,
పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.