గుంటూరు : స్కిల్ డెవలప్ మెంట్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో పనిచేస్తున్న
“సీడాప్” సంస్థ యొక్క 8వ ఎగ్జిక్యూటివ్ కమిటి మీటింగ్ మంగళవారం సురేష్ కుమార్
ప్రిన్సిపాల్ సెక్రటరీ, స్కిల్ డెవలప్మెంట్ అధ్యక్షతన జరిగింది. ఇందులో
సీడాప్ సంస్థ నిర్వహిస్తున్నట్టువంటి కార్యక్రమలమీద కూలంకషంగా సమీక్షించారు.
ఇందులో భాగంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కార్యక్రమము నందు
ఇంతవరకు 1,16,022 మంది యువతకు శిక్షణలు అందించి 78,128 యువతకు వివిధ
పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించి దేశములోనే మొదటి స్థానములో నిలిచినందుకు గాను
ప్రిన్సిపాల్ సెక్రటరీ సీడాప్ ముఖ్య కార్య నిర్వహణాధికారిని, సంస్థ ఇతర
సిబ్బందిని అభినందించారు. అదే విధముగా రాబోయే రోజుల్లో శిక్షణ కార్యక్రమాల
నిర్వహణలో తీసుకోవలసిన చర్యల గురించి సూచనలు, ఆదేశాలు జారి చేశారు. ప్రతి
శిక్షణ సంస్థకు ఎస్ ఓ పీ లను పగడ్బందిగా తయారు చేయమని, అదేవిధముగా శిక్షణ
పూర్తిచేసుకున్న అభ్యర్ధులు అందరికి క్యూ ఆర్ కోడ్ తో పొందిన సర్టిఫికెట్స్
జారిచేయుటకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి , మంత్రి
నైపుణ్య శిక్షణా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినందున, గ్రామీణ యువతకు
అండగా నిలవాలని చెప్పారు. సీడాప్ సిబ్బందికి సంబంధించిన వివిధ అంశములను
చర్చించి ప్రతి అంశము మీద పూర్తీ సమాచారముతో కూడిన ఫైల్సును సిద్ధం చేసి
సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశమునందు వినోద్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, నవ్య డైరెక్టరు, రాష్ట్ర
ఉపాధి, శిక్షణా శాఖ, యం.కె.వి శ్రీనివాసులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి,
సీడాప్, గ్రామీణా పేదరిక నిర్మూలన సంస్థ, రూరల్ డెవలప్మెంట్, ఇతర
ఉన్నతాధికారులు పాల్గొన్నారు.