టమాటా రైతులను అన్ని విధాలా ఆదుకున్న ప్రభుత్వం మాది
ప్రభుత్వ చర్యలు నిజంగా ఊరట నిచ్చాయన్న వినియోగ దారులు
విజయవాడ : బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు రైతు
బజార్లు లో సబ్సిడి పై టమాటా విక్రయాలు కొనసాగు తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కృష్ణలంక రైతు బజారును
సందర్శించి సబ్సిడితో టమోటో అందచేస్తున్న విధానాన్ని పరిశీలించి
వినియోగదారులతో ముచ్చటించారు. ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలు పట్ల
వినియోగదారులు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి
మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల వల్ల టమాటా పంట దెబ్బ తినడం వలన
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో
కిలో రూ.250 లకు చేరుకుందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులపై భారం
పడకూడదన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మార్కెట్ ఇంటర్
వెన్షన్ స్కీమ్.కింద మార్కెట్ లో జోక్యం చేసుకొని ఎంత ధర కైనా సరే రైతుల నుంచి
కొనుగోలు చేసిన కేవలం కిలో రూ.50 లకే రైతు బజార్ల ద్వారా విక్రయాలు
ప్రారంభించాం అన్నారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 600టన్నుల టమాటా లను రూ.6కోట్లతో
సేకరించమని చెప్పారు. రూ.3 కోట్ల పైచిలుకు సబ్సిడీ బరించి వినియోగదారులకు
అందిస్తున్నమని చెప్పారు. దేశ వ్యాప్తంగా కొరత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లాభాలను
ఆశించకుండా 103 రైతు బజార్లలో సబ్సిడీ తో టమోటలను అందిస్తున్న ఏకైక రాష్ట్ర
ప్రభుత్వం మనదే నన్నారు. గతం లో ధర తగ్గినప్పుడు కూడా ఇదే రీతిలో రైతులకు
గిట్టుబాటు ధర దక్కేలా చేశామని గుర్తు చేశామన్నారు. ఇలా గతంలో ఏ ప్రభుత్వం
టమాటా రైతులను కానీ, వినియోగ దారుల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పని చేసిన
ప్రభుత్వం మరొకటి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణితో పాటు విజయవాడ
తూర్పు నియోజక వర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, మార్కెటింగ్ కమిషనర్ రాహుల్
పాండే, రైతు బజార్స్ సీఈఓ రైతు బజార్ నంద కిషోర్,ఎన్టీఆర్ జిల్లా జాయింట్
కలెక్టర్ సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మార్కెటింగ్ రీజనల్
జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్లు, మార్కెటింగ్ అధికారులు
పాల్గొన్నారు.