విజయవాడ : ఇంద్రకీలాద్రి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాడ
మాసం సందర్బంగా దేవస్థానం నందు ఆలయ సెక్యూరిటీ విభాగం వారు అమ్మవారికి బుధవారం
పవిత్ర సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆలయ సెక్యూరిటీ వారి
ఆహ్వానం మేరకు ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ విచ్చేయగా
సెక్యూరిటీ విభాగం వారు కార్య నిర్వాహనాధికారి వారిని దుశ్శాలువతో సన్మానించి
స్వాగతం పలికారు. అనంతరం జమ్మిదొడ్డి లోని దేవతా మూర్తుల వద్ద ఆలయ అర్చకులు
పూజలు నిర్వహించి ఆలయ కార్యనిర్వాహణాధికారి వారు అధికారులు కొబ్బరికాయలు
కొట్టి పవిత్ర సారె కార్యక్రమంను ప్రారంభించారు. అనంతరం వీరు పవిత్ర సారెతో
ఊరేగింపుగా ఆలయమునకు చేరుకోగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి
దర్శనం కల్పించారు. అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు
చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అందరికీ
ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమములో ఆలయ సహాయ కార్య నిర్వాహణాధికారి
పి.చంద్రశేఖర్, సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.