విజయవాడ : జాతీయ స్ధిరాస్ధి అభివృద్ధి మండలి (నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్
మెంట్ కౌన్సిల్ – నారేడ్కో) నేతృత్వంలో జులై 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు
నగరంలోని ఎ ప్లస్ కన్వేన్షన్ సెంటర్ లో ప్రాపర్టీ షో నిర్శహిస్తున్నట్లు
సంస్ధ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు కె. ముక్తేశ్వరరావు తెలిపారు. బుధవారం
నగరంలోని మధు మాలక్ష్మి ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నారెడ్కో
ప్రతినిధులు వివరాలను అందించారు. ఈ సందర్భంగా ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఇతర
ప్రాపర్టీ షోలకు భిన్నంగా వినియోగదారుల అలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా దీనికి
రూపకల్పన చేసామన్నారు. మధ్యతరగతి ప్రజల మొదలు ఉన్నత వర్గాల వరకు అందరికీ
అందుబాటు నిర్మాణాల సమాచారం ఇక్కడ లభిస్తుందన్నారు. నేరేడ్కో కార్యవర్గ
సభ్యుడు సందీప్ మండవ మాట్లాడుతూ గృహాలను కొనుగోలు చేయాలనుకునే వారితో పాటు,
బిల్డర్లు, డెవలపర్లు మాత్రమే కాకుండా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, రియల్టీ
కన్సల్టెంట్లు, తయారీదారులు, ఉత్పత్తి సరఫరాదారులు, ఇంటీరియర్ డెకరేటర్లు,
ఆర్కిటెక్ట్లు, పరిశ్రమ నిపుణులు, విశ్లేషకులు… అలా అందరినీ ఒకే వేదికపైకి
తీసుకువస్తున్నామన్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సంబంధించిన అన్ని
పరిష్కారాలకు ఇది అనువైన ప్రదేశంగా ఉంటుందన్నారు. నేరెడ్కో రాష్ట్ర
కార్యదర్శి పరుచూరి కిరణ్ మాట్లాడుతూ ప్రాపర్టీ షోలో దాదాపు 50 సంస్ధలు తమ
ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయని, కొనుగోలు దారులకు ప్రత్యేక రాయితీలు కూడా
అందిస్తున్నాయని వివరించారు. దాదాపు పదిహేనువేల మంది సందర్శకులు వస్తారని
అంచనా వేస్తున్నామన్నారు. కార్యక్రమానికి టైటిల్ స్పాన్సరర్ గా వ్యవహరిస్తున్న
ఎస్ ఎల్ వి బిల్డర్స్, డవలపర్స్ డైరెక్టర్ చైతన్య కుమార్ మాట్లాడుతూ కరోనా
తరువాత విజయవాడ వేదికగా నిర్మాణ రంగంలో ఏర్పాటు కానున్న అతి పెద్ద ప్రాపర్టీ
షో ఇదే కానుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్లానింగ్ కమీషన్
ఛైర్మన్ మల్లాది విష్ణు వర్ధన్, పెనమలూరు, విజయవాడ పశ్చిమ ఎంఎల్ఎలు
పార్ధసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు
హాజరుకానున్నారు. కార్యక్రమంలో భాగంగా నారెడ్కో ప్రతినిధులు ప్రాపర్టీ షో
గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వాసిరెడ్డి వంశీ, సుధీర్, నాదెండ్ల
విజయకుమార్, పొట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.