న్యాయ వ్యవస్థ పై నమ్మకం
ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
మౌన సత్యాగ్రహం విజయవంతం
కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
విజయవాడ : బీజేపీ, మోడీ చేస్తోన్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్
గాంధీ పై అక్రమ కేసులు బనాయించి చట్ట సభల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. విజయవాడ ధర్నా
చౌక్ లో, పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో బుధవారం మౌన సత్యాగ్రహ కార్యక్రమం
నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సీడీ మయప్పన్,
ఏఐసీసీ కార్యదర్సులు క్రిస్టోఫర్ తిలక్, సిరివెళ్ల ప్రసాద్ తో పాటు పలువులు
మౌన సత్యాగ్రహం లో పాల్గొని నోటికి నల్లటి రిబ్బన్ లు కట్టుకుని తమ నిరసన
తెలుపుతూ రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియా తో మాట్లాడారు. దేశం
కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులపై సీబీఐ, ఈ డీ పేరుతో
వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి సంఘీ భావంగా
అవసరం అయితే ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఎప్పుడో 2019లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ వ్యక్తుల ద్వారా అక్రమ
కేసులు వేయించారని ఆరోపించారు. అటువంటి కేసుల్లో 2 సంవత్సరాల జైలు శిక్ష అనేది
165 సంవత్సరాల ఇండియన్ పీనల్ కోడ్ చరిత్రలోనే లేదని తెలిపారు. బీజేపీ
ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ చర్యలు దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం
కలిగించే విధంగా ఉన్నాయని భయాందోళనలు వ్యక్తం చేశారు.
అదానీ పై జేపీసీ కి డిమాండ్
బీజేపీ కి చెందిన 20,OOO కోట్ల రూపాయల అక్రమ సంపాదన అదానీ గ్రూపు లకు
పెట్టుబడులు రూపంలో వెళ్లడంపై రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ఎన్నోసార్లు
ప్రశ్నించినా ఇప్పటి వరకూ ప్రధాని మోదీ నుంచి కనీస స్పందన లేదని పీసీసీ చీఫ్
గిడుగు రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ అక్రమాలపై జాయింట్
పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ అని
ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఉన్న విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అదానీకి
అక్రమంగా ధారాదత్తం చేస్తున్నారని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు,
అదానీ అక్రమాలపై న్యాయం పరంగా పోరాటం చేస్తామని గిడుగు రుద్రరాజు
పేర్కొన్నారు. అదే విధంగా భారత దేశ న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందన్నారు.
రాహుల్ గాంధీ శిక్ష కు సంబంధించి సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుంది అని ఆయన
ఆశాభావం వ్యక్తం చేశారు.
2024లో రాహుల్ గాంధీ నే దేశ ప్రధాని
మోడీ, బీజేపీ మోసపూరిత చర్యలను దేశ ప్రజలు గమనిస్తున్నారని పీసీసీ అధ్యక్షులు
గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. 2024లో రాహుల్ గాంధీ నే భారత దేశ ప్రధాన
మంత్రి అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకొంటున్నారని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఘనవిజయంతో మార్పు ప్రారంభం అయ్యిందన్నారు.
రాబోయే మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రస్
పార్టీ విజయం సాధిస్తుందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ తోనే దేశ
ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
వర్షపు జల్లులు సైతం లెక్కచేయకుండా
ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మౌన
సత్యాగ్రహ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి
వచ్చారు. సత్యాగ్రహం ప్రారంభం అయిన దగ్గర నుండి మధ్య మధ్యలో చిరు జల్లులు ఆటంక
పరచినా లెక్క చేయకుండా నేతలూ, కార్యకర్తలు చివరి వరకు సత్యాగ్రహం లో
పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్, జే డీ శీలం, పీసీసీ మీడియా
కమిటీ ఛైర్మన్ తులసి రెడ్డి కూడా నోటికి నల్ల రిబ్బన్ లు కట్టుకుని మౌనం గానే
ప్రజానేత రాహుల్ గాంధీకి తమ సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13
జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు విజయవాడ వచ్చి మౌన సత్యాగ్రహం లో
పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీ
గా ధర్నా చౌక్ కి వచ్చి రాహుల్ గాంధీకి సంఘీ భావం తెలిపారు. జై కాంగ్రెస్,
రాహుల్ నాయకత్వం వర్ధిల్లాలి వంటి నినాదాలతో ప్రాంగణన్ని హోరెత్తించారు.
కాంగ్రెస్ శ్రేణులలో నూతన ఉత్సాహన్ని నింపిన ఈ కార్యక్రమంలో పీసీసీ
కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేష్
రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వి. గుర్నాధం, కో చైర్మన్ డాక్టర్ జంధ్యాల
శాస్త్రి, విజయవాడ కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, మైనార్టీ
సెల్ చైర్మన్ దాదా గాంధీ, ఎస్సీ సెల్ చైర్మన్ సాకే శంకర్, యూత్ కాంగ్రెస్
రాష్ట్ర అధ్యక్షులు రామారావు, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు మధు యాదవ్,
డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ రామచంద్రారెడ్డి, పార్టీ హ్యూమన్ రైట్స్
చైర్మన్ మన్నం రాజశేఖర్, సేవా దళ్ రాష్ట్ర ఛైర్మన్ యాలమందారెడ్డి, మాజీ
ఎమ్మెల్యే కమలమ్మ, సీనియర్ నేతలు కొరివి వినయ్, మేడా సురేష్ తో విజయవాడ రూరల్
జిల్లా అధ్యక్షులు బుర్రా కిరణ్, మచిలీపట్నం డీసీసీ అధ్యక్షురాలు లామ్ తాంతియా
కుమారి, గుంటూరు డీసీసీ అధ్యక్షులు లింగం శెట్టి ఈశ్వరరావు, ఏలూరు డీసీసీ
అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.