‘వందల కొద్దీ పండగలున్నా.. వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా.. నువ్వేలేనిదేదీ
వద్దు..” అంటూ తన ఆరాధ్య కోసం ప్రేమగా పాడుతున్నాడు కథానాయకుడు, ఆరాధ్య మనసు
దోచిన కథానాయకుడి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే ‘ఖుషి’ చూడాల్సిందే.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం
వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆరాధ్య గీతం బుధవారం విడుదలైంది. ‘నాతో రా..
నీలా రా.. ఆరాధ్య..’ అంటూ మొదలయ్యే ఈ పాటని తెలుగులో దర్శకుడు శివనిర్వాణ
రచించారు. సిద్ శ్రీరామ్, చిన్మయి ఈ పాటని ఆలపించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్
స్వరాలు సమకూర్చారు. విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో ఈ
పాట చాటి చెబుతుంది. ఇప్పటికే విడుదలైన ‘నా రోజా నువ్వే’ పాట ఎంతో ఆదరణ
పొందింది. ఆరాధ్య పాటకి అందుకు దీటుగా స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని
సెప్టెంబర్ 1న తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల
చేస్తామని సినీవర్గాలు తెలిపాయి. జయరాం, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, లక్ష్మీ,
అలీ, శరణ్యపొన్వణ్ణన్, రోహిణి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు