సపోటా తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను
అందిస్తుంది. సపోటాలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
*తక్షణ శక్తి:
సపోటో తినడంతో తక్షణ శక్తి లభిస్తుంది. సపోటాలో శరీరానికి శక్తిని అందించే
గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. వ్యాయామాలు చేసే ముందు సపోటా తినడం మంచిది.
*కంటి చూపు
సపోటాలో విటమిన్ ఏ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. సపోటా తినడంతో కంటి చూపు
మెరుగుపడుతుంది. వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలను నివారించడంలో సపోటా
సహాయపడుతుంది.
*రక్తహీనత మాయం:
సపోటాలో నియాసిన్, కాపర్, ఐరన్ కంటెంట్ లభిస్తుంది. ఐరన్ కంటెంట్ ఉండటంతో
రక్తహీనత సమస్య దరి చేరదు. నరాల బలహీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* జీర్ణ వ్యవస్థ:
సపోటాలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా
మార్చుతుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో
అల్సర్లను దూరం చేస్తుంది.
* కిడ్నీ ఆరోగ్యం:
కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సపోటా సహాయపడుతుంది. సపోటా తినడంతో
కిడ్నీల్లో రాళ్లు తొలగుతాయి.
* ఎముకల ఆరోగ్యం:
సపోటాలో కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా
మార్చుతుంది. గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా మేలు చేస్తుంది.
* వ్యాధినిరోధక శక్తి:
సపోటాలో విటమిన్ బీ, సీ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధకశక్తిని
మెరుగుపరుస్తుంది. సపోటా తినడంతో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
*ఒత్తైన జుట్టు:
రెగ్యులర్ గా సపోటా జ్యూస్ తాగడంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం,
చుండ్రు సమస్యలు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.