న్యూ ఢిల్లీ: భారత నౌకాదళం కోసం 26 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలతో పాటు
మూడు స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం
తెలిపింది. ఫ్రాన్స్ నుంచి 26 రాఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పీన్ తరగతికి
చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. రక్షణ కొనుగోళ్ల
మండలి చేసిన ప్రతిపాదనలను రక్షణ శాఖ గురువారం ఆమోదించింది. తాజా ప్రతిపాదనల
ప్రకారం ఒకే సీటు కలిగిన 22 రఫేల్ మెరైన్ విమానాలు భారత నౌకాదళానికి అందుతాయి.
దీంతో పాటు నాలుగు శిక్షణా విమానాలు సైతం అందుతాయి. ఒప్పందం విలువ రూ.90 వేల
కోట్లుగా ఉండవచ్చని అంచనా. అయితే, కచ్చితమైన విలువ మాత్రం ఒప్పందం ఖరారైన
తర్వాతే తెలిసే అవకాశం ఉంది. భారత్ వద్ద ప్రస్తుతం 36 రఫేల్ విమానాలు ఉన్నాయి.
ఒప్పందం ప్రకారం విడతలవారీగా ఈ యుద్ధ విమానాలను దసో ఏవియేషన్ భారత్కు సరఫరా
చేసింది. యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ రఫేల్ జెట్ గతేడాది డిసెంబర్లో
భారత్కు చేరుకుంది.

ఇంజిన్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్
ప్రధాన నరేంద్ర మోడీ చేపట్టిన ఫ్రాన్స్ పర్యటన టెక్నాలజీ, రక్షణ అంశాలే ప్రధాన
అజెండాగా సాగనుంది. భారత్కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లలో ఉపయోగించే
శక్తి ఇంజిన్ల కోసం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంశం పర్యటనలో కీలకమని సంబంధిత
వర్గాలు పేర్కొన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తున్న ఈ
ఇంజిన్లకు సాంకేతికత బదిలీ వల్ల.. భారత రక్షణ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని
తెలిపాయి.