గుంటూరు : క్యాబినెట్ మీటింగ్ లో దాదాపు 60 వేల ఎకరాలకు చెందిన అసైన్డ్
భూములు దళిత రైతులకు
ప్రయోజనం చేకూరే విధంగా యాజమాన్య హక్కులను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని
స్వాగితిస్తూ గురువారం ఏంటీఎంసీ పరిధిలోని తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం
ఎదుట మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్
చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,
ఏకలవ్య, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమ్మూరి
కనకారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భూమిలేని నిరుపేదలకు
లంక భూముల కేటాయింపునకు మంత్రి వర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం
అభినందనీయమని అన్నారు. గ్రామాల్లో కుల వృత్తులు చేసుకునే వారికి ఇచ్చిన ఇనామ్
భూములను నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి
క్యాబినెట్లో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని దీంతో 1.13 లక్షల మంది
బీసీలకు ప్రయోజనం కలగనుంది.1996 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు స్మశాన వాటికల
ఏర్పాటుకు రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద దళితులకు ఇచ్చిన
16,213 ఎకరాలకు సంబంధించి కట్టాల్సిన రుణాలను మాఫీ చేసిందని అన్నారు. ఈ
భూములపై పూర్తి హక్కులను దళితులకు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం
అభినందనీయమని అన్నారు.

రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని
అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ వికలాంగుల విభాగం రీజినల్
కోఆర్డినేటర్ దొండపాటి మధు కిరణ్,తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు
ముదిగొండ ప్రకాష్, మాజీ కౌన్సిలర్ వేముల లక్ష్మీ రోజా, ప్రకాష్, మోహన్,
బాబి,అంబారావు, ఉప్పు శీను, కొండ, నాసర్ వలి, కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.