విజయవాడ పశ్చిమ : పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గా రెండుసార్లు గెలిచిన
వెలంపల్లి శ్రీనివాసరావుని విమర్శించే అర్హత జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్
కు లేదని దుర్గగుడిపాలకమండలి సభ్యులు కట్టా సత్తెయ్య విమర్శించారు. గురువారం
విజయవాడ భవానీపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
మాట్లాడుతూ అన్ని కులాలకు పార్టీలో ఉన్నతమైన స్థాయిని కల్పించి పదవులను
ఇస్తున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే శీనన్నను కించపరచ విధంగా మాట్లాడితే
సహించేది లేదని సత్తయ్య
అన్నారు. ఎస్ టి కులానికి చెందిన తనను రాష్ట్రంలో అతి పెద్ద ఆలయాల్లో రెండోదైన
దుర్గమ్మ దేవస్థానంలో పాలకవర్గ సభ్యుడిగా నియమించిన ఘనత శీనన్నదని అన్నారు.
అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు,
ఆర్యవైశ్యులకు, కాపులకు, నగరాలకు, రెడ్డి కులాలకు, ఇలా అన్ని కులాలకు చెందిన
వారికి కార్పొరేటర్ స్థాయి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి
ఉన్నతమైన గుర్తింపు తీసుకొచ్చి పదవులు ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే వెలంపల్లి
శ్రీనివాసరావు అని కొనియాడారు. ఇటువంటి ప్రజా ప్రతినిధిని మరొకసారి కించపరిచే
విధంగా మాట్లాడితే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎస్.టి.కులం సంఘంతో మీ ఇంటి దగ్గర
నిరసన కార్యక్రమం చేస్తానని కట్టా సత్తెయ్య అన్నారు. పోతిన మహేష్ రాజకీయాల్లో
ముందు కార్పొరేటర్‌గా తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే
వెలంపల్లి శ్రీనివాసరావు పై అవాకులు, చెవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని
హెచ్చరించారు.