విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాతో త్వరలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
తాజాగా ఆ చిత్రంలోని ‘ఆరాధ్య’ పాట విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాట గురించి
విజయ్ మాట్లాడుతూ ‘మనసారా.. చెలితారా…. ఆరాధ్య’ అనే పాటలో పెళ్లైన ఒక కొత్త
జంట ఎలా ప్రేమలో మునిగి తేలుతున్నారో కనిపిస్తుంది. పెళ్లైన తర్వాత ఒక అందమైన
జీవితాన్ని గడిపే ఒక కొత్త జంటపై సాగే పాట ఇది. ఈ పాటలోని చాలా సన్నివేశాలు నా
ఊహలకు దగ్గరగా ఉన్నాయి. నాకింకా పెళ్లి కాలేదు. అది జరిగితే మాత్రం ఇలానే
ఉంటుంది. నా వైవాహిక జీవితాన్ని కూడా ఆ పాటలాగే చూడాలని నా కోరిక అని అన్నారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో లిరికల్ వీడియోగా రిలీజ్ అయిన ‘ఆరాధ్య’
పాట పాడిన సిద్ శ్రీరామ్ కి కృతజ్ఞతలు. ‘ఖుషి’ సినిమాలోని అన్ని పాటలు చాలా
బాగున్నాయి. ఆ పాటల్లో ఇష్టమైనదేదో చెప్పాలంటే చాలా కష్టం’ అన్నారు.