వివరాలను వెల్లడించిన హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను కలుపుతూ సుమారు 34 కిలో
మీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి దాదాపు 11 కోట్ల రూపాయల వ్యయంతో 4 బీటీ రోడ్లు
మంజూరు అయినట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్
తానేటి వనిత తెలిపారు. శుక్రవారం సాయంత్రం కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో
హోంమంత్రి మీడియా ప్రతినిధులకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హోంమంత్రి
తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని
ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందించడంతో పాటు అన్ని ప్రాంతాలను
అభివృద్ధి చేస్తోందని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలో మార్టేరు నుండి
ప్రక్కిలంక రోడ్డును ధర్మవరం, మలకలపల్లి, పెద్దేవం, బల్లిపాడు, వేగేశ్వరపురం,
తాళ్లపూడి మీదుగా 9.97 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు
మంజూరయ్యాయని తెలిపారు. ఊనగట్ల నుండి బ్రాహ్మణ గూడెం వరకు కలవలపల్లి మీదుగా
8.35 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణానికి మరో 2.8 కోట్ల రూపాయలు
మంజూరయ్యాయన్నారు. అలాగే చాగల్లు నుండి చిక్కాలపాలెం రోడ్డు అమ్మికుంట మీదుగా
6.90 కి.మీ. బీటీ రోడ్డు శాంక్షన్ అయ్యిందన్నారు. ఈ నిర్మాణం కోసం 1.8 కోట్ల
రూపాయలు మంజూరయ్యాయన్నారు. చిట్యాల నుండి కుమారదేవం వరకు మొత్తం 11.60 కి.మీ.
మేర బీటీ రోడ్డు కోసం 3 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆమె తెలిపారు. ఈ నిర్మాణంలో
తిరుగుడుమెట్ట, పెద్దేవం, రావూరుపాడు మీదుగా కుమారదేవం వరకూ 8.6 కి.మీ. మేర
బీటీ రోడ్డు కొవ్వూరు నియోజకవర్గంలో నిర్మాణం జరుగుతుందని హోంమంత్రి తానేటి
వనిత వివరించారు.