హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన
సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనీ గోల్కొండ
కోట లో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా సౌండ్ అండ్
లైట్ షో ను పరిశీలించారు. గోల్కొండ కోట లో సౌండ్ అండ్ లైట్ షో కు పర్యాటకుల
నుండి ఆదరణ పెరిగేలా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి అధికారులను
ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన గోల్కొండ కోట కు వచ్చే
పర్యాటకులకు కనీస సౌకర్యాలు లు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కోటలో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని పర్యాటకశాఖ
అధికారులను ఆదేశించారు. కోట పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని
సూచించారు. పర్యాటకులకు ఇబ్బంది కాకుండా స్థానికులు వ్యవహరించాలని కోరారు.
గోల్కొండ కోట గైడ్ లు కోట ప్రాముఖ్యత, విశేషాలను మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్
కి వివరించారు.

అనంతరం గోల్కొండ బోనాల సందర్భంగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్ధ ఉద్యోగులు
నిర్వహించిన బోనాల ఉత్సవాలలో పాల్గొని అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పర్యాటక శాఖ ఉద్యోగులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో
పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర గీతా
కార్పొరేషన్ సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, టూరిజం ఎండి మనోహర్,
ఉన్నతాధికారులు సత్యనారాయణ, ఓం ప్రకాష్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నర్సింగ్
రావు, ఉద్యోగ సంఘం నాయకులు రాజమౌళి, ఉద్యోగులు పాల్గొన్నారు.