ప్రస్తుతం టాలివుడ్ లో అగ్రస్థానం లో కొనసాగుతుంది కీర్తి సురేష్. ఉదయనిధి
స్టాలిన్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “నాయకుడు”. ఈ సినిమాని
మారి సెల్వరాజ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే తెలుగు
ప్రేక్షకుల ముందు కొచ్చింది. ఈ నేపథ్యంలోనే కీర్తి తాజాగా విలేకర్లతో చిత్ర
విశేషాలు పంచుకుంది. “మారి సెల్వరాజ్ కథల్లో నటించాలని ప్రతి నాయికకు ఆసక్తి
ఉంటుంది. ఎందుకంటే ఆయన కథల్లో మహిళా పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆయన
నాకి కథ చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. అయితే ఆయన చెప్పిన దాని
కన్నా నాలుగు రెట్లు ప్రభావవంతంగా తెరపై చూపించారు. చిన్నగా మొదలైన గొడవ ఏ
స్థాయికి వెళ్తుంది? దాని వల్ల ఎదురయ్యే పరిణామాలేంటి? అన్నది ఇందులో
అద్భుతంగా చూపించారు. నిజానికి ఈ సినిమాకి ముందు నాకు లుక్ టెస్ట్ చేయలేదు.
కానీ, చిత్రీకరణకు గంట ముందు లుక్ టెస్ట్ చేసి నన్ను ఫైనల్ చేశారు. ఈ చిత్రం
కోసం ఉదయనిధి స్టాలిన్ తో కలిసి పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన సెట్స్
లో ఎంతో సరదాగా ఉంటారు. రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన
ఆకర్షణగా నిలిచింద’ని చెప్పుకొచ్చారు. కీర్తి సురేష్ ఆమె ప్రస్తుతం తమిళంలో
‘సైరన్, ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’ చిత్రాలతో పాటు తెలుగులో ‘భోళా శంకర్ ‘తో
అలరించనున్నట్లు చెప్పారు.