వర్షాకాలం వచ్చిదంటే చాలు ఇన్ఫెక్షన్లు విజృంభిస్తాయి. జీర్ణ వ్యవస్థ
మందగిస్తుంది. రోగనిరోధకశక్తి బలహీనంగా మారుతుంది. వీటన్నింటి నుంచి ఉపశమనం
పొందేందుకు ఈ కూరగాయలు తింటే చాలు.
1) స్వీట్ పొటాటో:
వర్షాకాలంలో స్వీట్ పొటాటో తినడంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇందులో ఉన్న బీటా
కెరోటిన్ వ్యాధినిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ
అలెర్జీలను దూరం చేయడంలో ఇది సహాయపడుతుంది.
2) కాకరకాయ:
తినడానికి చేదుగా ఉండే కాకరకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
వర్షాకాలంలో శ్వాసకోస సమస్యలు అధికంగా ఉంటాయి. అటువంటి సమయంలో కాకారకాయ తినడం
ఉత్తమం. కాకరకాయ ఆయాసం సమస్యను దూరం చేస్తుంది.
3) క్యారెట్:
వర్షాకాలంలో శరీరంలోని మలినాలు బయిటకు వెళ్లవు. ఇటువంటి సమయంలో క్యారెట్
తినడంతో శరీరం డీటాక్సిఫై అవుతుంది. మలినాలు సులభంగా బయిటకుపోతాయి. అయితే ఈ
కాలంలో పచ్చి క్యారెట్లు బదులు ఉడికించిన క్యారెట్లు తినండి.
4) మెంతి కూర:
వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా బయిట ఆహారం తినడంతో
అజీర్తి ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలో మెంతికూరను ఆహారంలో భాగం చేసుకోవడం
మంచిది.
5) ముల్లంగి:
శరీరాన్ని వెచ్చగా మార్చడంలో ముల్లంగి సహాయపడుతుంది. వానా కాలంలో గొంతు
ఇన్ఫెక్షన్లు కామన్ వస్తాయి. ముల్లంగిని తినడంతో గొంతు గరగర సమస్య తొలగుతుంది.
6) వెల్లుల్లి:
వర్షాకాలంలో వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోండి. వెల్లుల్లిని తినడంతో
శరీరంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. బీపీని కంట్రోల్ చేయడంలో ఇది
సహాయపడుతుంది.
7) అల్లం:
వానా కాలంలో అల్లం టీ తాగడం మంచిది. అల్లం టీ తాగడంతో వ్యాధినిరోధకశక్తి
మెరుగుపడుతుంది. దీంతో వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. జీర్ణ
వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.
8) క్యాప్సికం:
వర్షాకాలంలో పచ్చిమిరపకాయలు, క్యాప్సికం తినడం మంచిది. ఇందులో ఉన్న విటమిన్ సీ
రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. క్యాప్సికం
తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.