ఉంటాయి.
*దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి.
* ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ ని ఇవి నిరోధిస్తాయి. దీంట్లో ఉండే విటమిన్ బి
కాంప్లెక్స్ గర్భిణుల్లో ఉమ్మనీరు పెంచేందుకు సహాయపడుతుంది.
* వాల్ నట్స్ లో ఉండే మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరమంతటికీ రక్తం బాగా సరఫరా
అయ్యేలా చేస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను
పెంచుతాయి.
* దీనిలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది.
*రోజూ గుప్పెడు తీసుకుంటే శరీరానికి సరిపడా ప్రోటీన్లు అందుతాయి. అలాగే బరువూ
తగ్గొచ్చు.
* మధుమేహం బారి నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది. క్రమం తప్పకుండా వాల్ నట్స్ ను
తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
* పేగుల్లో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేయటంలో ఆక్రోట్ ప్రధాన పాత్ర
పోషిస్తుంది. జీర్ణ, గ్యాస్ సంబంధిత సమస్యలను ఇది దూరం చేస్తుంది.
* దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. తరచూ దీన్ని
తీసుకోవడంవల్ల ఆర్థరైటిస్‌తో వచ్చే నొప్పులు, వాపులు క్రమంగా తగ్గుతాయి.
* వాల్ నట్స్ తినడం వల్ల మన చర్మానికి, శరీరానికి హాని కలిగించే ఫ్రీ
రాడికల్స్ బయటకి పోతాయి. కళ్ల కింద వచ్చే నల్లటి వలయాలు తగ్గడంతో పాటు జుట్టు
ఆరోగ్యంగా ఉంటుంది.