కసరత్తులు చేయొచ్చు జాగింగ్, సైక్లింగ్, యోగా చేయొచ్చు. అవీ కుదరకపోతే
ఇంట్లోనే కాసేపు స్కిప్పింగ్ చేయండి. దీంతోనే ఫిట్ గా మారొచ్చు.
* రోజులో కనీసం 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే వాకింగ్ చేస్తే కరిగే
కెలోరీలకన్నా రెండింతలు కరిగిపోతాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనముంటుంది.
* తాడట 20 నిమిషాలు ఆడితే 200+ కెలోరీలు ఖర్చవుతాయి. క్రమం తప్పకుండా రోజూ
ఆడితే వేగంగా బరువు తగ్గొచ్చు.
* స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు శరీర పైభాగం వేగంగా కదులుతూ గుండెకు రక్తప్రసరణ
సాఫీగా జరుగుతుంది. దీంతో హృదయ సంబంధ జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
* ఈ ఆటతో శారీరకంగానే కాదు, మానసికంగానూ లాభాలున్నాయి. ఏకాగ్రతతో ఆడతాం
కాబట్టి మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
* గెంతేటప్పుడు ఎంత సమయంలో వేగంగా గెంతాలనే దానిపై మనం దృష్టి పెడతాం. దీంతో
అన్ని విషయాల్లో వేగంగా స్పందించడం అలవడుతుంది.
* ఇంతకు ముందు కాస్త దూరం నడిచినా అలసటగా అనిపించే వారికి స్కిప్పింగ్ చేయడం
అలవాటయ్యాక వేగంగా, సునాయసంగా ఎంత దూరమైనా నడవగలరు.
* తాడట ఆడటం వల్ల చెమట పడుతుంది. దీంతో శరీరంలోని మలినాలు చెమట రూపంలో
బయటకుపోతాయి. చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
* చిన్నారులు స్కిప్పింగ్ చేస్తే శరీరం సాగి పొడవు పెరుగుతారు. ఎముకలు కూడా
బలంగా తయారవుతాయి.
* స్కిప్పింగ్ చేశాక ఊపిరి వేగంగా తీసుకుంటాం. దానితో కడుపు పైభాగాన ఉండే
కొవ్వు కరిగిపోతుంది. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.
* చూశారు కదా ఎన్ని లాభాలు ఉన్నాయో..మీరు క్రమం తప్పకుండా ఇంట్లోనే హాయ్ గా
స్కిపింగ్ చేయండి.
*ఈ వ్యాయామం ప్రారంభించిన మొదట్లో కాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. అలాగని
ఆపకూడదు. తక్కువ సమయంతో మొదలుపెట్టి.. క్రమంగా పెంచుతూ పోవాలి. ఇలా చేస్తే
నొప్పులుండవు.