కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాస రావు (స్వాములు) శనివారం జనసేన పార్టీలో
చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
ఆమంచి స్వాములుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి
ఆహ్వానించారు. ఇటీవల చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున స్వాములు ఫొటోతో
కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో ఆయన ఇవాళ జనసేన
పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ప్రకాశం జిల్లా వైసీపీ కీలక నేత ఆమంచి
శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి
స్వాములు ర్యాలీగా అభిమానులుతో చేరుకున్నారు. స్వాములుకు పవన్ కళ్యాణ్ జనసేన
కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు
స్వాములు సోదరుడు. “చీరాల నుంచి ఆమంచి స్వాములు జనసేనలో చేరడం చాలా సంతోషం.
నేను చీరాలలో పెరిగిన వాడినే అంటూ ఆ ప్రాంతంలో పేటల పేర్లను పవన్ చదివి
వినిపించారు. ఆమంచి శ్రీనివాసులను మనస్పూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నా.
కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడు. కష్టం వస్తే నేను ఉన్నా అని నిలబడే
వ్యక్తి. స్వాములు రాకతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జనసేనకు బలం
వచ్చినట్టే. ఆమంచి కుమారుడు రాజేంద్ర కూడా మా పార్టీలో చేరడం యువత మార్పుకు
చిహ్నం. అరాచక ప్రభుత్వం పోవాలి.. అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. జనం
బాగుండాలంటే జగన్ పోవాలని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొంతమంది
మాత్రమే కాదు అందరూ బాగుండాలని జనసేన సిద్దాంతం. మన హక్కులను మనం
సాధించుకుందాం. ఒకరిని దేహీ దేహీ అని అడుక్కొ వద్దు. అందరం కలిసి రాష్ట్రం
హితం కోసం పని చేద్దాం. మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డుపెడతా. ఎవడొస్తాడో ఇక
నుంచి చూద్దాం. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై పడిన దెబ్బ నా మీద పడినట్లే.
ఆమంచి స్వాములు మీద దెబ్బ పడినా నేను వెళతా. జనసేనకు జన బలం ఉంది. అన్ని
జిల్లాల్లో వైసీపీ దౌర్జన్యాలను బలంగా ఎదుర్కొందాం అని పవన్ కల్యాణ్ అన్నారు.