గుంటూరు : రాజధాని ప్రాంతంలోని మందడంలో రైతులు సుదర్శన యాగం నిర్వహించారు.
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రార్థిస్తూ యాగం చేపట్టారు. రేపు
ఆర్-5 జోన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమరావతికి
మద్దతుగా తీర్పు రావాలని ప్రార్థించారు. సుదర్శన యాగంలో టీడీపీ సీనియర్ నేత,
మాజీ మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి
రైతుల కన్నీటి కడలిలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. సీఎం జగన్
ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి నుంచి రాజధానిని తరలించలేరని చెప్పారు.
జగన్ ప్రభుత్వానికి దేవినేని ఉమ సెల్ఫీ చాలెంజ్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
సెల్ఫీ చాలెంజ్ చేశారు. “వెలగలేరులో ఇళ్ళ నిర్మాణం అందరికీ ఒక కేస్ స్టడీ.
జగన్ రెడ్డి, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చూడండి మీరు
చెబుతున్న జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణం. బుడమేరు ఫ్లాష్ ఫ్లడ్ ఎప్పుడూ
వస్తుందో తెలియదు, వస్తే కాలనీ మెత్తం మునిగిపోయే పరిస్థితి. ఒక గృహిణి చేతితో
నేడితే పడిపోయే స్థితిలో పేదల ఇళ్ళ నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయి. పేదల
కోసం చంద్రబాబు నాయుడు నిర్మించిన టిడ్కో ఇళ్ళను ఇవ్వడం లేదు జగన్ రెడ్డి.
రంగులు వేసుకుని గుడివాడలో ఇచ్చాడు కానీ, వారికి మౌలిక సదుపాయాలు
కల్పించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. కలెక్టర్‌కు చెబుతున్నా,
బాధ్యత తీసుకుని పరిశీలించి ఇక్కడ నిర్మాణం చేపట్టిన ఏజెన్సీపై విచారణ
జరిపించాలి. బ్లాక్ లిస్టులో పెట్టండి. పేదలు అర్థరాత్రి ఇంట్లో ఉంటే బుడమేరు
ఫ్లాష్ ఫ్లడ్ వస్తే, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఉమ ఆగ్రహం వ్యక్తం
చేశారు.