అమరావతి : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల ఫలితంగా పేదల
తలరాతలు మారుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఆయన పలు అంశాలు
వెల్లడించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ
మైనార్టీల్లోని పేదలకు ఆస్తులపై హక్కులు లభించాయని అన్నారు. అసైన్డ్ భూములపై
లబ్దిదారులకు హక్కులు లభిస్తున్నాయని, లంక భూములకు డీ పట్టాలు పంపిణీ పంపిణీ,
భూమి కొనుగోలు పథకం కింద రుణం మాఫీ కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి
దళితవాడకు స్మశాన వాటిక ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ : విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు
చేపట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
ప్రభుత్వం ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఐ ఎఫ్ పీల
వినియోగం, బోధనపై 1.34 లక్షల మందికి తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. 26
జిల్లాల నుంచి 11,455 పాఠశాలలు ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే 144
కాలేజీల్లో డిజిటల్ పాఠాలు బోధించనున్నట్లు తెలిపారు.
రైతులకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ
రంగంలో డ్రోన్ల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం ఆధునికీకరించడంతో పాటు
పంటలో అధిక దిగుబడి సాధ్యపడుతుందని అన్నారు. అలాగే రాష్ట్రంలోని 10,00
ఆర్బీకేల్లో డ్రోన్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఆధునిక వ్యవసాయంలో
భాగంగా రైతులు డ్రోన్ల సహాయంతో పురుగులు మందులు చల్లడం, భూ పరీక్షలు
నిర్వహించే విధంగా శిక్షణ ఇవ్వనున్నారని అన్నారు.