విజయవాడ : బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఖైరతాబాద్, అంబర్
పేట్, విద్యానగర్ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను ఏపీ పీసీసీ అధ్యక్షులు
గిడుగు రుద్రరాజు దర్శించుకున్నారు. స్థానిక కాంగ్రస్ నేతలతో కలిసి ఆదివారం
బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఆయనకు సంబంధిత ఆలయ అధికారులు లాంఛనాలతో స్వాగతం
పలికారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా రుద్రరాజు
అమ్మ వార్ల కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ బోనాల నిర్వహణ కమిటీ సభ్యులు
గిడుగు రుద్రరాజుకు శాలువా కప్పి సత్కారం చేశారు. అమ్మవారికి బోనాలు
సమర్పించేందుకు వేలాదిగా తరలి వస్తోన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా
అన్ని ఏర్పాట్లు చేయడం పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా అన్ని ఆలయాల కమిటీ సభ్యులను ఏపీ
పీసీసీ చీఫ్ ప్రత్యేకంగా అభినందించారు.