దీనికోసం చర్మ సౌందర్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అయితే కొన్ని అలవాట్లు
కూడా ముఖంపై ముడతలకు కారణమవుతాయి. వాటికి దూరంగా ఉంటే ఎల్లపుడూ యవ్వనంగా
కనిపించవచ్చు.
* చక్కెర వాడకం:
అతిగా చక్కెర వాడకం వల్ల తొందరగా ముడతలు వస్తాయి. చక్కెర మన శరీరంలో గ్లైకేషన్
కు గురవుతుంది. ఇది చక్కెర, ప్రోటీన్ల మధ్య జరిగే ఓ రసాయన చర్య.ఇది ప్రోటీన్
పనితీరును ప్రభావితం చేస్తుంది. చర్మం స్థితిస్థాపకతను బలహీనపర్చి ముడతలకు
కారణమవుతుంది.
* ఒత్తిడి:
ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారిలో తొందరగా వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. అధిక
ఒత్తిడి సమయంలో అడ్రినల్ గ్రంథుల ద్వారా విడుదలయ్యే హార్మోన్లు ముఖంపై ముడతలకు
కారణమవుతాయి.
* నిద్రలేమి:
ప్రస్తుతం చాలామంది పిల్లలు, యువత మొబైల్స్ వల్ల నిద్రలేమికి గురవుతున్నారు.
దీనివల్ల టీనేజ్ సమయంలోనే వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయి. తక్కువ నిద్ర
కొల్లాజెన్ ఉత్పత్తిపై ప్రభావంచూపుతుంది. ఇది చర్మంపై ఎఫెక్ట్ చూపి ముడతలకు
కారణమవుతుంది.
* సిగరెట్:
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. అలాగే చర్మ సౌందర్యంపై కూడా ప్రభావం
పడుతుంది. అతిగా స్మోకింగ్ వల్ల చర్మం డల్ గా మారి ముడతలు వస్తాయి.
సిగరెట్లోని సమ్మేళనాలు కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా చర్మంపై అకాల
ముడతలు ఏర్పడతాయి.
* కాలుష్యం:
గాలిలోని కాలుష్య కారణాలు ఆక్సీకరణ ఒత్తిడికి కారణమవుతాయి. దీనివల్ల చర్మంపై
ముడతలు వస్తాయి. ఈ కాలుష్యం వల్ల ఎలాస్టిన్, కొల్లెజన్ ఉత్పత్తి
దెబ్బతింటుంది. దీంతో ముడతలు వచ్చే అవకాశం ఉంది.
* పొడి చర్మం:
పొడి చర్మం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. చర్మం పగిలిపోయి దురద,
చికాకు కలిగిస్తుంది. చర్మంం పగిలి ముడతలు కూడా ఏర్పడతాయి. కాబట్టి పొడి చర్మం
ఉన్నవారు తరచూ మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది. అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి.
* ఆల్కహాల్:
ఆల్కహాల్ వల్ల బాడీ తొందరగా డీహైడ్రేట్ అవుతుంది. దీంతో చర్మం తేమ కోల్పోయి
పొడిబారిపోతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు తొందరగా వస్తాయి.
* మెడిసిన్:
చిన్న వయసులోనే కొందరు అనారోగ్య సమస్యల కారణంగా తరచూ మెడిసిన్ వాడుతుంటారు.
ఇలాంటి వారిలోనూ చర్మం ముడతలు తొందరగా వస్తాయి. అలాగే డ్రగ్స్ తీసుకోవడం వల్ల
కూడా ముడతలు వస్తాయి.