బ్రిటన్ : తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ కీలక స్థానాలను
కోల్పోవడంతో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఓటర్లకు హామీల వర్షం కురిపించారు.
బ్రిటన్‌లో రిషి సునాక్ నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి
ఎదురుదెబ్బ తగలడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గతంలో 10 లక్షల ఇల్లు
కట్టిస్తామని తమ పార్టీ ఇచ్చిన హామీని పూర్తి చేస్తామని ప్రధాని సునాక్
తెలిపారు. బర్మింగ్‌హామ్‌లోని ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణలో పాల్గొన్న ఆయన
మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కల కలగానే మిగిలిపోతుంది. కానీ
మీ కలలను సాకారం చేస్తాను. మారుమూల ప్రాంతాలలో నిరుపయోగంగా ఉన్న భూములను
నిరాశ్రయులైన వారికి అందించి సొంత గృహాన్ని నిర్మిస్తాం. మేము అధికారంలో
ఉన్నప్పుడే 10 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేస్తాం ’ అని పునరుద్ఘాటించారు.
గతవారంలో జరిగిన ఉపఎన్నికల్లో రెండు స్థానాలు కోల్పొవడంతో ఓటర్ల విశ్వాసం
పొందేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కర్బన ఉద్గారాలపై
మాట్లాడుతూ.. తాము త్వరలోనే నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకొనే దిశగా పురోగతి
సాధిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాము సహేతుకంగానే చర్యలు
తీసుకొంటామన్నారు. అంతేకానీ, ఈ లక్ష్యం కోసం ప్రజలపై అనవసర భారాలు మోపి వారి
జీవితాలను ఇబ్బంది పెట్టమని హామీ ఇచ్చారు. బ్రిటన్‌లో దాదాపు 65శాతం మంది
ఓటర్లు సునాక్‌కు ప్రతికూలంగా ఉండగా 25శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నట్లు
ఇటీవల సర్వే పేర్కొంది. ‘యూ గవ్ పోల్’ పేరిట నిర్వహించిన సర్వేలో దాదాపు 2,151
మంది బ్రిటన్ వాసుల అభిప్రాయాలను సేకరించారు. ఆయనపై ఉన్న సానుకూల దృక్పథం
దాదాపు 40శాతం తగ్గిందని కంపెనీ పేర్కొంది. ఇక గత నెలతో పోల్చుకొంటే 6 శాతం
తగ్గింది.