హైదరాబాద్ : రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఎరువుల
రిటైల్ షాపులను ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా మారుస్తున్నామని
కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ‘భారత్ బ్రాండ్’ పేరుతో రేపటి నుంచి
ఎరువుల అమ్మకాలు అమల్లోకి వస్తాయన్నారు. అక్కడ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు
నిర్దేశిత ధరలతో అందుబాటులో ఉంటాయని చెప్పారు. నాంపల్లిలోని బీజేపీ
కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి దశలో రేపు
లక్షా 25వేల షాపులను ప్రధాని ప్రారంభిస్తారని కిషన్రెడ్డి తెలిపారు. భూసార
పరీక్షలు, విత్తన పరీక్షలు ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారన్నారు. వ్యవసాయానికి
కావాల్సిన పరికరాలు అక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. సల్ఫర్ కోటెడ్
యూరియాను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. 14వ విడత
కిసాన్ సమ్మాన్ నిధులను 8.5కోట్ల మంది రైతుల ఖాతాల్లో రేపు ప్రధాని జమ
చేస్తారన్నారు. తెలంగాణలోని 39లక్షల మంది రైతుల ఖాతాలో కిసాన్ సమ్మాన్ డబ్బులు
జమ అవుతాయని చెప్పారు.