విజయవాడ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా
ఉండాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యాత్మక ప్రదేశాలలో
అధికారులతో కలిసి బుధవారం ఆయన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. న్యూ రాజ
రాజేశ్వరిపేట, పోస్టుమాన్ రామచంద్రరావు వీధి, పటేల్ నగర్, ఎల్బీఎస్ నగర్,
రాజీవ్ నగర్, కండ్రిక, భానునగర్ లలో విస్తృతంగా పర్యటించారు. స్థానికులతో
మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీనిచ్చారు. రోడ్లపై చేరిన
వర్షపు నీరు వెంటనే పోయేవిధంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఎయిర్ టెక్ మెషీన్ల సాయంతో నీటిని యుద్ధప్రాతిపదికన తోడించాలని ఆదేశించారు.
అవసరమైన ప్రదేశాలలో మెరక తోలించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
అలాగే సైడ్ డ్రెయిన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని,చెత్త, సిల్ట్
కారణంగా ఎక్కడా నీరు నిలిచే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న
రైల్వే పనుల కారణంగా న్యూ రాజరాజేశ్వరిపేట నుంచి అయోధ్యనగర్ కి వెళ్లు
రహదారిని తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని.. వీలైనంత త్వరలో మరలా
పునరుద్ధరిస్తామని మల్లాది విష్ణు తెలియజేశారు. భానునగర్ 3వ వీధిలో స్థానిక
ప్రజల విజ్ఞప్తుల మేరకు రోడ్డు నిర్మించడంతో ముంపు సమస్య చాలా వరకు తప్పిందని
అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు
తెలియజేశారు. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలకు చలి తోడు కావడంతో ప్రజలు
ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని మల్లాది విష్ణు సూచించారు. ఎమ్మెల్యే
వెంట ఈఈ (ఇంజనీరింగ్) శ్రీనివాస్., డీఈ(యూజీడీ) రామకృష్ణ., 64వ డివిజన్ వైసీపీ
కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ, నాయకులు ఇసరపు రాజారమేష్, కాళ్ల ఆదినారాయణ,
అలంపూర్ విజయ్, వీరబాబు, మోదుగుల గణేష్, పసుపులేటి యేసు, ఇస్మాయిల్, కనపర్తి
కొండా తదితరులు ఉన్నారు.