జిల్లా ఖజానా సహా నాలుగు కార్యాలయాలకు ఇందులో వసతి
ప్రారంభించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం : నగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో కొత్తగా నిర్మించిన
ఆర్ధిక మంత్రిత్వశాఖ కార్యాలయాల సముదాయాన్ని(ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్
కాంప్లెక్స్) రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జూలై 28న
ప్రారంభించనున్నట్టు జిల్లా ఖజానా అధికారి ఆర్.ఏ.ఎస్.కుమార్
వెల్లడించారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు జరిగే కార్యక్రమానికి డిప్యూటీ
స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షత వహిస్తారని, జిల్లాకు
చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఖజానా శాఖ డైరక్టర్ ఎస్.మోహనరావు
పాల్గొంటారని తెలిపారు. రూ.14.30 కోట్ల వ్యయంతో మూడు అంతస్థుల్లో
నిర్మించిన ఈ భవన సముదాయంలో జిల్లా ఖజానా అధికారి కార్యాలయంతో పాటు, పే
అండ్ అకౌంట్స్ కార్యాలయం, ఏ.పి.ప్రభుత్వ బీమా కార్యాలయం, జిల్లా ఆడిట్
అధికారి(స్టేట్ ఆడిట్) కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.