సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్న
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
అమరావతి : పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత
విద్యా కోర్సులు అభ్యసించేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు
రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్ధులకు రూ. 1 కోటి వరకు 100% ఫీజు
రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులను నేడు విడుదల
చేయనున్నారు. అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను గురువారం
సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్న
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. గడచిన 6 నెలల్లో
“జగనన్న విదేశీ విద్యా దీవెన” క్రింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు.
క్యూ ఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ / టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్
ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం మొదలైన 21
ఫ్యాకల్టీలకు సంబంధించి టాప్-50 ర్యాంక్లు సాధించిన కళాశాలల్లో ప్రవేశం పొందిన
ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర
విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, విమాన ప్రయాణం,
వీసా ఖర్చులతో సహా దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో
ఉచితంగా చదువు కునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం లభించింది. జగనన్న
ప్రభుత్వంలో అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్త స్థాయిలో “జగనన్న విదేశీ
విద్యా దీవెన”. ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో
అడ్మిషన్లు.. సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి
ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు.
నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూ ఎస్వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్/
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఎంపిక చేయబడ్డ 21 ఫ్యాకల్టీలకు
సంబంధించి టాప్ – 50 యూనివర్శిటీల ఎంపిక. పూర్తి ఆర్థిక సాయం.. ఎస్సీ, ఎస్టీ,
బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి
గరిష్టంగా రూ.1 కోటి వరకు ఎంతైతే అంత 100% ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్..
విమాన, వీసా ఛార్జీలు సైతం రీయింబర్స్మెంట్. విద్యార్థులు కోర్సు పూర్తి
చేసుకునేలా వారి చదువులు ఒక్కోమెట్టూ ఎక్కే కొద్ది 4 వాయిదాల్లో స్కాలర్
షిప్స్ మంజూరు. ఇమ్మిగ్రేషన్ కార్డు (ఐ-94) పొందాక తొలి వాయిదా, మొదటి
సెమిస్టర్ ఫలితాల తర్వాత 2వ వాయిదా, 2వ సెమిస్టర్ ఫలితాల తర్వాత 3వ వాయిదా.
విజయవంతంగా 4వ సెమిస్టర్ పూర్తి చేసి మార్క్ షీట్ ఆన్లైన్ పోర్టల్ లో అప్ లోడ్
చేసాక చివరి వాయిదా చెల్లింపు. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి అర్హతను రూ. 8
లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతోంది.