ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి
నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో
జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది. ప్రస్తుతం
ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 14 వరద
గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అయితే, ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా అందులో నాలుగు గేట్లు
తెరుచుకుకోకుండా ఇంకా మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా వాటికి
తగ్గ నీటిని వదులుతున్నా వచ్చే వరద నీరు ఇదే పరిస్థితిలో కొనసాగితే ముప్పు
తప్పదన్న భావన స్థానికుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను
సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు. గత ఏడాది వరద ఉద్ధృతి కారణంగా అపారనష్టం
వాటిలినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎల్లంపల్లికీ పోటెత్తిన వరద : ఎగువ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లాలోని
ఎల్లంపల్లి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం జలాశయం నుంచి
31,638 క్యూసెక్కులు, గోదావరి పరీవాహక ప్రాంతంలోని వాగులు వంకలు ఉప్పొంగి
ఎల్లంపల్లిలోకి 1.21 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టు
గరిష్ఠ నీటి మట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146.24కు చేరుకుంది. నీటి
నిల్వ సామర్థ్యం 15.47 టీఎంసీలుగా నమోదైంది. అధికారులు 20 గేట్లు ఎత్తి 1.67
లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోసారి వణుకు
పుట్టిస్తోన్న కడెం ప్రాజెక్టు.. 4 గేట్ల మొరాయింపు
కడెం: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తోంది.
ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి
నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో
జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది. ప్రస్తుతం
ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 14 వరద
గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అయితే, ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా అందులో నాలుగు గేట్లు
తెరుచుకుకోకుండా ఇంకా మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా వాటికి
తగ్గ నీటిని వదులుతున్నా వచ్చే వరద నీరు ఇదే పరిస్థితిలో కొనసాగితే ముప్పు
తప్పదన్న భావన స్థానికుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను
సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు. గత ఏడాది వరద ఉద్ధృతి కారణంగా అపారనష్టం
వాటిలినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎల్లంపల్లికీ పోటెత్తిన వరద : ఎగువ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లాలోని
ఎల్లంపల్లి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం జలాశయం నుంచి
31,638 క్యూసెక్కులు, గోదావరి పరీవాహక ప్రాంతంలోని వాగులు వంకలు ఉప్పొంగి
ఎల్లంపల్లిలోకి 1.21 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టు
గరిష్ఠ నీటి మట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146.24కు చేరుకుంది. నీటి
నిల్వ సామర్థ్యం 15.47 టీఎంసీలుగా నమోదైంది. అధికారులు 20 గేట్లు ఎత్తి 1.67
లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.