ఊపిరితిత్తులలోని గాలి సంచులు ఎర్రబడతాయి. గాలి సంచులు ద్రవం లేదా చీముతో
నిండినప్పుడు కఫం లేదా చీము, జ్వరం, చలి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఏర్పడవచ్చు. న్యుమోనియా బ్యాక్టీరియా, వైరస్లు మరియు ఫంగస్ తో సహా వివిధ రకాల
జాతుల వల్ల సంభవించవచ్చు.ఈ వ్యాధి కారణంగా శ్వాస సరిగా తీసుకోలేరు. ఛాతిలో
నొప్పి పెరుగుతుంది. వర్షకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.కావున ఈ ఆహార
పదార్థాలను తీసుకోవటం వల్ల ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు.
పెరుగు:
పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి న్యుమోనియాకు కారణమైన
బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచి న్యుమోనియాకు
వ్యతిరేకంగా పోరాడుతుంది.
తేనె:
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్
గా తేనె తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. మరియు బ్యాక్టీరియా
పెరుగుదలను ఇది నియంత్రిస్తుంది.
పసుపు:
న్యుమోనియా నుంచి ఉపశమనం అందించడంలో పసుపు సహాయపడుతుంది. పసుపులో ఉండే
కర్కుమిన్ న్యుమోనియాతో పోరాడుతుంది అలాగే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
అల్లం:
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి
న్యుమోనియాకు కారణమైన సూక్ష్మజీవులతో పోరాడతాయి. ఇవి ఛాతి నొప్పిని
తగ్గిస్తాయి.
నారింజ:
నారింజలో విటమిన్ సీ కంటెంట్ అధికంగా ఉంటుంది. రోగనిరోధకశక్తిని
మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. నారింజ తినడంతో న్యూమోనియాకు కారణమైన వైరస్ తో
పోరాడే శక్తి లభిస్తుంది.
కివీ:
కివీలో విటమిన్ సీ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని బలంగా
మార్చుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. కివి
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ను దూరం చేస్తుంది.
బ్రౌన్ రైస్:
బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాల్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి
శక్తిని అందిస్తాయి. బ్రౌన్ రైస్ రెగ్యులర్ గా తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నట్స్:
నట్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. నట్స్ ను రెగ్యులర్ గా
తినడంతో కణాలు ఆరోగ్యంగా మారుతాయి. నట్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి.