తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ కొంతమంది దొండకాయ ఇష్టంగా తింటారు.మనం
దొండకాయ తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూదాం..
1.దొండకాయను మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు.
2. వీటిలో యాంటీ అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో
ఉంచుతాయి.
3. దొండకాయ, దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. షుగర్
పేషెంట్స్ వారంలో ఒక రోజు దొండకాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా రక్తంలో
చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
4. దొండకాయలో థయామిన్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ లనుగ్రూకోజ్ మార్చే పోషకం.
ఇది శరీరంలో శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచుతుంది. జీవక్రియను నియంత్రిస్తుంది.
5. దొండకాయలోని థయామిన్ రక్త ప్లాస్మాలోకి ప్రవేశిస్తుంది. ఇది మరింత శక్తిని
ఉత్పత్తి చేస్తుంది. థయామిన్ ఎర్ర రక్త కణాల తయారీకి కూడా సహాయపడుతుంది.
6. దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది.
7. దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
8. దొండకాయలో స్థూలకాయన్ని నిరోధించే గుణాలు ఉంటాయి.
9. దొండకాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను
మెరుగుపరుస్తుంది.
10.దొండ కాయలను తినడం వల్ల మలబద్ధకం, అల్సర్లు, ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ
సమస్యలను దూరం చేస్తుంది.
11. కాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయి.
12. ఇందులోని బేటా కెరోటిన్ విటమిన్- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని
మెరుగు పరుస్తుంది.
13. ఆస్తమాను నివారించడంలో కూడా దొండకాయలు కీలక పాత్ర పోషిస్తాయి.
చూశారు కదా దొండ కాయ తినటం వల్ల ఏన్ని ప్రయోజనాలు పొందవచ్చో..మీరు కూడా దొండ
కాయలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ ప్రయోజానాలని పొందవచ్చు.