‘బవాల్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్
ధావన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు
చేశారు. ప్రస్తుతం ‘జవాన్’ సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు అట్లీ దర్శకత్వంలో
తన 18వ సినిమా చేయనున్నట్లు తెలిపారు. ‘ఈ సినిమా గురించి ఇంకా నేను ఏమీ
చెప్పలనుకోవట్లేదు. కానీ ఈ ప్రాజెక్టు కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
అట్లీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను..ఇదోక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
గా మీ ముందుకు రానుంది. నేను ఎక్కువగా ఇష్టపడే వినోదం ఈ చిత్రంలో ఉండబోతోంది.
ఈ సినిమా కోసం నేను సిద్దంగా ఉన్నాను’ అని వరుణ్ అన్నారు. ఈ చిత్రానికి మురద్
కేతని నిర్మాతగా వ్యవహరించనున్నారు. అట్లీ దర్శకత్వంలో వస్తుందంటే అభిమానులకు
పండగే. ఈ సినిమా ఏలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి